Home » ఆఫ్రికాలో అంతుచిక్కని వ్యాధి..89 మంది మృతి…!

ఆఫ్రికాలో అంతుచిక్కని వ్యాధి..89 మంది మృతి…!

by AJAY
Ad

ఆఫ్రికాలో కరోనా నుండి పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ వేరియంట్ ఇప్పటికే ఇతర దేశాలకు కూడా పాకి దడ పుట్టిస్తోంది. అయితే మూలుగుతున్న నక్కపై తాటిపండు పడినట్టు ఇప్పుడు ఆఫ్రికాను మరో కొత్త వ్యాధి వణికిస్తోంది. అంతుచిక్కని వ్యాధితో సౌత్ సుడాన్ లో ప్రజలు చనిపోతున్నారు. దక్షిణ సూడాన్ లోని జోంగి రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దాంతో రాష్ట్రంలో వరదలు ముంచెత్తాయి.

Advertisement

Advertisement

వరదల కారణంగా నీరు, ఆహారం పూర్తిగా కలుషితమై పోయింది. దోమల బెడద కూడా ఎక్కువయింది. భారీ వరదల నేపథ్యంలో ప్రజలకు ఆహారం దొరకడం కూడా కష్టంగా మారింది. అయితే ఈ క్రమంలో జొంగ్లిని ఫంగక్ అనే నగరంలో ఏకంగా 89 మంది అంతుచిక్కని వ్యాధితో మరణించారని సౌత్ సుడాన్ మంత్రి కుగ్వాంగ్ వెల్లడించారు. దాంతో మరణించిన వారికి ఏ వ్యాధి సోకింది అని తెలుసుకునే పనిలో వైద్యాధికారులు ఉన్నారు.

 

మరోవైపు ఆ ప్రాంతంలో చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అంతేకాకుండా వేలమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొందరు సైంటిస్టుల బృందాన్ని ఆఫ్రికా కు పంపింది. అక్కడ సోకిన వ్యాధి గురించి ఆరా తీయాలని సైంటిస్ట్ లను పంపించింది. వరదలు సంభవించడం వల్ల నీటి కాలుష్యంతో వచ్చినా వ్యాదా… లేదంటే ఏదైనా కొత్త రకం వ్యాధి సోకిందా అన్న దాన్ని నిర్ధారించే పని లో సైంటిస్టుల బృందం ఉంది.

Visitors Are Also Reading