Home » తెలంగాణలో కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు… పోస్టుల వివరాలు ఇవే

తెలంగాణలో కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు… పోస్టుల వివరాలు ఇవే

by Bunty
Ad

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. వైద్యారోగ్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం, దవాకనాలు, వైద్య కళాశాలల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా చేపడుతున్నది. రాష్ట్రంలో నూతనంగా ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమరం భీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నది. వీటిల్లో నియామకానికి గతంలో 3,897 ఉద్యోగాలకు అనుమతి ఇవ్వగా, కొత్తగా మరో 313 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ శనివారం ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Advertisement

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాలు 313 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందులో 45 గైనకాలజీ, 33 జనరల్ మెడిసిన్, 32 జనరల్ సర్జన్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో ముందడుగు పడింది.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఎనిమిది మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 15న ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా ఒకేసారి 8 మెడికల్ కాలేజీలలో విద్యాబోధన తరగతులను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ ప్రారంభం తర్వాత ఆయా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్టియర్ తరగతులు లాంచనంగా ప్రారంభమయ్యాయి.

READ ALSO : AP Constable Preliminary Results 2023: కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల… ఇలా చెక్ చేసుకోండి

Visitors Are Also Reading