Telugu News » Blog » AP Constable Preliminary Results 2023: కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల… ఇలా చెక్ చేసుకోండి

AP Constable Preliminary Results 2023: కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల… ఇలా చెక్ చేసుకోండి

by Bunty
Ads

ఏపీ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో చేపట్టిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గత నెలలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సివిల్ కానిస్టేబుల్ లతో పాటు ఏపీఎస్పీ కానిస్టేబుల్ నియామకాల కోసం గత ఏడాది నవంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 6500 కు పైగా ఉద్యోగాలను పోలీస్ శాఖలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

Advertisement

Advertisement

కానిస్టేబుల్ నియామక పరీక్షల కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 997 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,59,182 మంది హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 95,208 మంది అర్హత సాధించారు. కానిస్టేబుల్ నియామకాల కోసం నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో ఓసి అభ్యర్థులకు 40 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు.

200 మార్కులకు ఓసి అభ్యర్థులు 80 మార్కులు సాధించిన వారిని తదుపరి పరీక్షలకు అర్హులుగా నిర్ణయించారు. బీసీ అభ్యర్థులకు 35 శాతం మార్కుల్ని కటాఫ్ గా నిర్ణయించారు. 200 మార్కులకు 70 మార్కులు వచ్చిన వారిని అర్హులుగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 30% కటాఫ్ గా నిర్ణయించారు. 60 మార్కులు వచ్చిన వారిని మిగిలిన దశలకు అర్హులుగా ప్రకటించారు. ఫలితాల కోసం https://slprb.ap.gov.in చేయండి.

Advertisement

READ ALSO : శివరాత్రికి ముందే ఈ రాశుల వారి కోరికలు తీరుతాయి… ఇందులో మీరు ఉన్నారా?