సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో సంగీత దర్శకులు అంటే కీరవాణి.. థమన్, లేదంటే దేవీ శ్రీ ప్రసాద్ పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇప్పటివరకు రేసులో వీరే ముందున్నారు. గతంలో మణిశర్మ, మిక్కి జే మేయర్ వంటి సంగీత దర్శకులు కూడా ఇండస్ట్రీలో రాణించారు. ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. కొత్త సంగీతం వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇతర భాషలకు చెందిన సంగీత దర్శకులను తెచ్చుకుంటున్నా మూవీ మేకర్స్.
Advertisement
ముఖ్యంగా హేషమ్ అబ్దుల్ వహాబ్, అజినీష్ లోక్ నాథ్, జీ.వీ.ప్రకాశ్ కుమార్, జేక్స్ బిజాయ్, యువన్ శంకర్ రాజా, అనిరుధ్.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో ఇప్పుడు చాలా మంది కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఖుషి, హాయ్ నాన్నతో రొ**మాంటిక్ జోనర్స్ కి హేషమ్ కేరాఫ్ గా మారిపోయారు. అదేవిధంగా కాంతారా ఫేమ్ అజినీష్ విరూపాక్ష మూవీతో మాయ చేశారు. ఇప్పుడు మంగళవారం అంటూ వచ్చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ చాలా రోజుల తరువాత తెలుగు బిజీ అయ్యారు. టైగర్ నాగేశ్వరరావుకు ఆయన మ్యూజిక్ ఇచ్చారు. ఆదికేశవకు సంగీతమందిస్తున్నారు.
Advertisement
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి యువన్ ట్యూన్స్ ఇస్తున్నారు. నాని సరిపోదా శనివారం మూవీకి జేమ్స్ బిజాయ్.. దేవర, విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమాలకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి తెలుగులో సరికొత్త సంగీతం అయితే చాలా బలంగానే వినిపిస్తోంది. అయితే వీరి రాకతో తెలుగులో ఉన్న చాలా మంది సంగీత దర్శకులు ఈ మధ్య కాలంలో కను మరుగు అయ్యారనే చెప్పవచ్చు. మణిశర్మ, మిక్కిజే మేయర్ తదితర సంగీత దర్శకులు అడప దడప సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ కొత్త ట్రెండ్ కొనసాగుతుందని స్పష్టమవుతోంది.
మరికొన్ని టాలీవుడ్ వార్తలు కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి.