భారత జట్టు ప్రస్తుతం తీరికలేని క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గత ఏడాది మిగిలిపోయిన టెస్ట్ మ్యాచ్ తో పాటుగా టీ20, వన్డే సిరీస్లు ఆడటానికి ఇంగ్లాండ్ వెళ్ళింది భారత జట్టు. అయితే ఈ పర్యటన ఈ నెల 17న ముగుస్తుంది. ఇక ఈ పర్యంతాం తర్వాత వెస్టిండీస్ టూర్ కు వెళ్తుంది. అక్కడ ఈ నెల 22 నుండి వచ్చే నెల 7 వరకు వైట్ బాల్ సిరీస్ లో విండీస్ వీరులతో తలపడుతుంది. ఇక ఇక్కడ ఈ పర్యటన ముగిసిన అనంతరం భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్తుంది. ఈ విషయాన్ని తాజాగా బీసీసీఐ ప్రకటించింది.
Advertisement
కానీ ఇక్కడే ఇంకో ప్రశ్న అనేది వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో భారత జట్టు చేస్తున్న కెప్టెన్ల మార్పు గురించి అందరికి తెలిసిందే. ఈ ఏడాది గడిచిన ఏడు నెలలో ఏడుగురు కెప్టెన్లను మార్చింది. ఇక విండీస్ కు వెళ్లనున్న వన్డే జట్టును ఇప్పటికే ప్రకటించినా బీసీసీఐ.. సీనియర్లకు విశ్రాంతిని ఇచ్చి శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టును పంపిస్తుంది. దాంతో ఈ పర్యటన తర్వాత వెళ్లనున్న జింబాబ్వేకు కూడా యువ ఆటగాళ్లతోనే కూడిన జట్టునే పంపిస్తుంది అని.. దీనికి మరో కొత్త కెప్టెన్ ను తీసుకురానుంది అని తెలుస్తుంది.
Advertisement
ఎందుకంటే జింబాబ్వే అనేది చాలా చిన్న జట్టు. మరి వెస్టిండీస్ లాంటి జట్టును ఎదర్కోవడానికే యువ ఆటగాళాల్ను పంపిస్తే అంతకంటే చిన్న జట్టు అయిన జింబాబ్వేతో ఆడటానికి కూడా కొత్త కెప్టెన్ తో యావ ఆటగాళ్లను పంపిస్తుంది అనే చర్చ జరుగుతుంది. అయితే 2016 లో ఆఖరిసారిగా ధోని కెప్టెన్సీలో జింబాబ్వేకు వెళ్ళింది భారత జట్టు. ఇప్పుడు మళ్ళీ అయారు సంవత్సరాల తర్వాత భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్తుండటంతో… టీం ఇండియాన ఎవరు నడిపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి :