ఆచార్య చాణక్య చెప్పే నీతిలో జీవితానికి చాలా ఉపయోగపడుతాయని చాలా మంది చాణక్య నీతులను ఫాలో అవుతున్నారు. చాణక్య తన నీతిలో తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మెగాలో ఓ నీతి ద్వారా తెలిపారు. ఎలాగో ఇప్పుడు తెలసుకుందాం..!
Advertisement
మీ పిల్లలు మీతో అబద్దం చెబుతున్నారని తెలిసినట్టయితే తల్లిదండ్రులుగా మీరు తప్పు, ఒప్పులను గ్రహించాలి. పిల్లలకు ఉన్న అలవాటును తొలగించే విధంగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా అబద్దం చెప్పే అలవాటు చాలా తొందరగా నేర్చుకుంటారు. సకాలంలో దీనికి అడ్డుకట్ట వేయకపోతే పిల్లలు మీకు అబద్దాలు చెప్పేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. ఫలితంగా మీ పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్లేందుకు అవకాశాలు కూడా ఉంటాయి.
Advertisement
అప్పుడు మీరు మీ పిల్లలను అదుపు చేయలేరు. అందుకే పిల్లలకు నిజం చెప్పే అలవాటును చిన్నప్పటి నుంచే నేర్పించాలి. చాణక్య నీతి ప్రకారం.. పిల్లలకు మొండితనం తొందరగా అలవడుతుంది. అందుకే వారు మాట్లాడే ప్రతీ మాటకు తల్లిదండ్రులు తల ఊప కూడదు. పిల్లల మాట జాగ్రత్తగా వినండి. తప్పు, ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని వారికి చెప్పండి. వారు అడిగినవి వెంటనే కొనిఇవ్వకండి. మితిమీరి గారాబం చేయడం ద్వారా పిల్లలో ఉన్న మంచి అలవాట్లు క్షీణించి.. వారిలో మొండితనం ఎక్కువగా పెరుగుతుంది.
ముఖ్యంగా పిల్లలు తమ తల్లిదండ్రులతో సమయం ఎక్కువగా గడుపుతారు. తల్లిదండ్రుల అలవాట్లను వారు గమనించి అనుసరిస్తారు. అందుకే మీరు నిరంతరం సత్ప్రవర్తనతో మెలిగేందుకు ప్రయత్నించండి. తద్వారా వారు మీ నుంచి మంచి విలువలను స్వీకరించగలుగుతారు. పిల్లల ముందు ఎప్పుడూ గొడవ పడకండి. ఇది పిల్లల్లో కోపాన్ని చికాకును పెంచుతుంది. చిన్నతనం నుంచే పిల్లలో మంచి విలువలకు ఏర్పడేందుకు పునాది వేయండి గొప్ప వ్యక్తుల గురించి వారికి ఎప్పటికప్పుడు చెప్పాలి. వారు ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు వారికి ప్రోత్సహాన్ని అందించడంతో సక్రమ మార్గంలో నడుస్తుంటారు. పిల్లల గురించి చాణక్య తన నీతిలో తెలియజేశారు.