ఐదవ రోజు సెషన్ లో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో 7 వికెట్లు తీసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు చాంపియన్ గా నిలిస్తే, భారత్ ఫైనల్స్ లో ఓటమిని ఎదుర్కొని రన్నరప్ ట్రోఫీతో నిలిచింది. నాలుగో రోజు ఆటలో పట్టులేనట్లు కనిపించిన ఆస్ట్రేలియా ఐదవ రోజు మాత్రం ఓ రేంజ్ లో విజృంభించేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో ఆసీస్ ఇండియా కంటే ఎందుకు బలంగా ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Advertisement
అంకెలు, సంఖ్యల ఆధారంగా మనుషుల వ్యక్తిత్వాలు, పరిస్థితులను అంచనా వేస్తూ జ్యోతిష్యం చెప్పడాన్ని న్యూమరాలజీ అంటారు. ఈ లెక్కలతోనే క్రికెట్ లో విజయాల గురించి కూడా విశ్లేషించవచ్చు. భారత కెప్టెన్ రోహిత్ తో పోలిస్తే ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తన టీం ని మరింత సమర్ధవంతంగా నడిపించారని అనిపిస్తుంది. పాట్ కమ్మిన్స్ మే 8వ తేదీ జన్మించారు. తద్వారా ఆయన అనూహ్యంగా అంతర్ దృష్టి, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ను పొందారు.
Advertisement
ఏప్రిల్ 30 న జన్మించిన రోహిత్ శర్మ సహచరులకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వాలో బాగా తెలుసు. రోహిత్ తన సహచరులను బాగా ఇష్టపడతారు. సహచరుల సాయంతోనే గెలుస్తాడు. ఈ సంవత్సరం ఆయన కోసం చాలా సర్ప్రైజ్ లు ఉన్నా అవి ఈ ఏడాది ద్వితీయార్ధంలో కనిపిస్తాయి. మరోవైపు పాట్ కమిన్స్ పాలకుల వెనుక శక్తిగా ఉంటారు. అతని సిక్స్త్ సెన్స్, బ్రెయిన్, సహనం, మానేజ్మెంట్ స్కిల్స్ అతని భవిష్యత్ ను నిర్ణయిస్తాయి. పాట్ డెస్టినీ నెంబర్ 2 , పర్సనల్ మంత్ 8 ద్వారా అదృష్టం కూడా కలిసి వచ్చింది.
మరోవైపు రోహిత్ డెస్టినీ నెంబర్ 5 , అతని పర్సనల్ నెల 2 కు ప్రతికూలమైనది. దీనివలన జూన్ నెలలో రోహిత్ ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ప్రత్యేకించి మొదటి వారంలో ఎక్కువ కష్టపడ్డారు. మరోవైపు స్టార్ బ్యాటర్ అయినా కోహ్లీ వైఫల్యం కూడా రోహిత్ ఆశలపై చాలా ప్రభావం చూపించింది. కోహ్లీకి కూడా 5 వ నెంబర్ అధిపతి. కోహ్లీ కి, రోహిత్ కు ఈ ఏడాది ద్వితీయార్ధంలో పెద్ద పెద్ద మార్పులను చూస్తారు.
మరిన్ని ముఖ్య వార్తలు:
నేటి నుంచే ఒక లక్ష ఆర్ధిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు…తట్టుకోలేక పేరెంట్స్ ఏం చేశారంటే…?
అంబానీ డ్రైవర్ నుండి కుక్ వరకు వారి జీతం ఎంతో తెలుసా?