Home » దంగల్ నటిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు

దంగల్ నటిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు

by Anji
Ad

అమిర్‌ఖాన్ హీరోగా న‌టించిన దంగ‌ల్ చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది సాన్య మ‌ల్హోత్ర‌. బ‌దాయిహో శకుంత‌ల‌దేవి, శంకుంత‌లాదేవి, లూడో, ప‌గ్లైట్ వంటి సినిమాల‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత‌గా చేరువైంది. రింగు రింగుల జుట్టుతో ఎంతో క్యూట్‌గా క‌నిపించే ఈ సొగ‌స‌రికీ సోష‌ల్ మీడియాలో కూడా అభిమానులు భారీగానే ఉన్నారు. తాజాగా చేసిన ఓ ప‌నికి ఫ్యాన్స్‌తో పాటు నెటిజ‌న్‌లంద‌రూ ప్ర‌శంస‌లు కురిపిస్తూ ఉన్నారు.

Sanya Malhotra shares reason behind her 'heart-wrenching' break-up in 2020,  reveals recent conversation with ex | Bollywood - Hindustan Times

Advertisement

ఈమెకు సంబంధించిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అందులో ఒక షాపులోంచి బ‌య‌టికి వ‌చ్చి త‌న కారు వైపు వెళ్లుతుండ‌గా.. కొంద‌రూ ఫొటోగ్రాఫ‌ర్లు సాన్య‌ను త‌మ కెమెరాల్లో బంధించ‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఈ ప్ర‌య‌త్నంలో ఓ ఫొటోగ్రాఫ‌ర్ ప్ర‌మాద‌వ‌శాత్తూ కింద‌ప‌డిపోయాడు. అది గ‌మ‌నించిన ఈ దంగ‌ల్ బ్యూటీ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వ్య‌క్తిని పైకి లేపేందుకు ప్ర‌య‌త్నం చేసింది. ఆ త‌రువాత అంతా ఒకేనా..? మీరు ఎలా ఉన్నారు సార్‌..? దెబ్బ‌లు ఏమైనా తగిలాయా..? అంటూ అత‌ని యోగ, క్షేమాలను అడిగి తెలుసుకుంది.

Advertisement

Sanya Malhotra says important to keep your politics aside and empathise  with character - Movies News

ఈ ముద్దుగుమ్మ వీడియో సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ అయిన కొద్ది గంట‌ల్లోనే చాలా వైర‌ల్‌గా మారిపోయినం0ది. దీనిని చూసిన నెటిజ‌న్లు, అభిమానులు, సాన్య‌కేరింగ్‌ను మెచ్చుకుంటున్నారు. నువ్వే కాదు.. నీ మ‌న‌సు కూడా అంద‌మే, యూఆర్ సో క్యూట్ అండ్ స్వీట్ అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక ఈమె సినిమాల విష‌యానికి వ‌స్తే ల‌వ్ హాస్ట‌ల్ అనే చిత్రంలో న‌టిస్తున్న‌ది సాన్యా. అదేవిధంగా షారూఖ్‌, అట్లీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే చిత్రంలో ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నుంది.

Visitors Are Also Reading