మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాజాగా వస్తున్న సినిమాల్లో గాడ్ ఫాథర్ సినిమా కూడా ఒక్కటి. అయితే ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన లూసిఫర్ కు రీమేక్ గా వస్తుంది. అయితే ఈ సినిమా అనేది ప్లాప్ అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమా ఇంకా విడుదలే కాలేదు. అప్పుడే ప్లాప్ అని కామెంట్స్ చేయదని కారణం ఈరోజు వచ్చిన మోషన్ టీజర్.
అయితే రోజు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు ఈ గాడ్ ఫాథర్ మోషన్ టీజర్ అనేది విడుదల చేసింది చిత్రబృందం. అయితే వచ్చిన కొద్ది సమయం నుండే ఈ సినిమా ప్లాప్ అనే వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం ఈ సినిమాలో కూడా ఆచార్య సినిమా మాదిరే కథకు కాకుండా హీరోకు పాధాన్యం ఇచ్చారు అనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే కొరటాల శివ డైరెక్షన్ చేసిన ఆచార్య సినిమా ఎం అయ్యిందో అందరికి తెలుసు.
కథను వదిలేసి హీరోకు ప్రాతినిధ్యం ఇవ్వడం వల్లే ఆచార్య ప్లాప్ అయ్యిది అని చాల మంది అన్నారు. ఇక ఇప్పుడు లూసిఫర్ లో కూడా అదే చేస్తున్నారు అని అంటున్నారు. లూసిఫర్ ఒరిజినల్ లో మోహన్ లాల్ ఎంత కామ్ గా సినిమా చేసాడు. కానీ ఈ రీమేక్ లో మెగాస్టార్ అలా చేయలేదు అంటున్నారు. ఎలివేషన్స్ ఎక్కువగా ఉన్నట్లు టీజర్ చూస్తే కనిపిస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎం అవుతుంది అనేది.
ఇవి కూడా చదవండి : వరల్డ్ కప్ జట్టును బీసీసీఐ ఎప్పుడు ప్రకటిస్తుందో తెలుసా..?
పాకిస్థాన్ ఇండియాను చూసి నేర్చుకోవాలి..!