Home » పాకిస్థాన్ ఇండియాను చూసి నేర్చుకోవాలి..!

పాకిస్థాన్ ఇండియాను చూసి నేర్చుకోవాలి..!

by Azhar
Ad

ఆసియా కప్ లో భాగంగా ఈ నెల 28న పాకిస్థాన్ జట్టు ఇండియాతో తలబడబోతుంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సమయంలో పాక్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టులో ముఖ్యమైన బౌలర్ గా ఉన్న షాహిన్ ఆఫ్రిది గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్ నుండి దూరమయ్యాడు. కాబట్టి అతడి స్థానాన్ని మొహ్మద్ ఆమిర్ మాత్రమే భర్తీ చేయగలడు అని.. మళ్ళీ అతడిని జట్టులోకి తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement

దాంతో ఆమిర్ పేరు అనేది ట్రేండింగ్ లోకి వచ్చింది. అయితే తన పేరు ట్రేండింగ్ లో చుసిన ఆమిర్..” నా పేరు ట్రెండ్ అవుతుంది.. ఎందుకు..?” అని ఓ పోస్ట్ చేసాడు. అలాగే అతను షాహిన్ ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసాడు. అయితే ఇండియాలో ఫాస్ట్ బౌలింగ్ అనేది ఇప్పుడు ట్రెండ్ మార్క్ గా మారిపోయింది. అలాగా బుమ్రా లేకపోయినా చాలామంది పేసర్లు ఉన్నారు. ఇప్పుడు ఇండియానే పేసర్ల హబ్.

Advertisement

అక్కడ వారికీ ఇప్పుడు మూడు ఫార్మాట్లలో ఆడటానికి ఆటగాళ్లు ఉన్నారు. కానీ పాకిస్థాన్ లో అలా ఉండదు. ఒక్క పేసర్ మంచిగా అదృష్టం కొద్ది దొరికితే అతడినే అన్ని ఫార్మట్స్ లో ఆడిస్తారు. ప్రత్యర్థి జట్టు ఏదైనా కానీ… అతనికి రెస్ట్ అనేది ఉండదు అని చెప్పాడు. అయితే ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడం… రొటేషన్ పాలసీలో పాకిస్థాన్ ఇండియాను చూసి నేర్చుకోవాలి అని మొహ్మద్ ఆమిర్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

కూతుర్ల కోసం పెద్ద నిర్ణయం తీసుకున్న వార్నర్..!

వరల్డ్ కప్ జట్టును బీసీసీఐ ఎప్పుడు ప్రకటిస్తుందో తెలుసా..?

Visitors Are Also Reading