ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా అందరికీ పరిచయమే. అయితే తాజాగా ఆయన జావెలిన్ త్రో చేస్తూ కిందపడ్డాడు. కోర్టానె గేమ్స్‌లో శనివారం స్వర్ణం సాధించిన అతడు మూడవ రౌండ్‌లో ఈటెను విసిరే క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా జారి పడ్డాడు. ఫిన్‌లాండ్‌లో జరిగిన ఈ పోటీల సందర్భంగా శనివారం అక్కడ వర్షం కురవడంతో అథ్లెట్లు పరుగెత్తే ట్రాక్ తడిసిపోయింది. పలువురు ఇబ్బందులను ఎదుర్కున్నారు.
Advertisement
ఈ తరుణంలోనే నీరజ్ కూడా తొలి ప్రయత్నంలో 86.69 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడు. ఇదే ఈ ఈవెంట్‌లో అత్యుత్తమ త్రోగా నిలవడం విశేషం. వాల్కట్ 86.64 మీటర్లు రజతం సాధించగా.. పీటర్స్ 84.75 కాంస్యం గెలుచుకున్నారు. అంతకు ముందు త్రోపావో నుర్మి క్రీడలో నీరజ్ 89.30 మీటర్ల దూరం జావెలిన్ త్రో చేసి రజతం సాధించాడు. అక్కడ పీటర్స్ 86.60 దూరంతో కాంస్యం సాధించాడు. మరొకవైపు నుర్మి క్రీడలో స్వర్ణం సాధించిన హెలాండర్ ఈ ఈవెంట్‌లో పాల్గొనకపోవడం గమనార్హం.
Advertisement
నీరజ్ చోప్రాను భారతీయులు అభినందిస్తున్నారు. జారి పడినా కానీ భారత్‌కు పతకం తీసుకురావడం గర్వకారణం అని పలువురు పేర్కొంటున్నారు. నీరజ్ చోప్రాకు సోషల్ మీడియాలో పలువురు అభినందిస్తున్నారు. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విజయాలు ఇంకా ముందు ముందు మరెన్నో సాధించాలని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read :
వర్షం కారణంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ రద్దు.. సిరీస్ సమం..!
ఫాదర్స్ డే రోజు కొడుకును పరిచయం చేసిన యువరాజ్‌సింగ్.. పేరు ఏమిటంటే..?
After an intentional foul on his second, he slips on his third.. Testing conditions out there…#NeerajChopra pic.twitter.com/71qRFcEEyJ
— Naveen Peter (@peterspeaking) June 18, 2022