గత కొన్ని ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న లవ్ బర్డ్స్ నయనతార విగ్నేష్ శివన్ ఈ నెల 9న మహాబలేశ్వరం లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నయనతార విగ్నేష్ ల అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి బంధుమిత్రులు సన్నిహితులు హాజరయ్యారు. సినిమా పరిశ్రమ నుండి సైతం వీరి వివాహానికి కొంతమంది హాజరయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం నయనతార విగ్నేష్ ల వివాహం జరిగింది. అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి విగ్నేష్ శివన్ తల్లిదండ్రులు హాజరయ్యారు.
Advertisement
కానీ ఈ వివాహానికి నయనతార తల్లి ఒమయ కురియన్ మాత్రం హాజరు కాలేదు. దాంతో అనుమానాలు మొదలయ్యాయి. నయనతార తల్లికి ఈ వివాహం ఇష్టం లేదని అందువల్లే ఆమె పెళ్లికి దూరంగా ఉన్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగానే ఆ వార్తలకు చెక్ పెట్టడానికి నయనతార విగ్నేష్ శివన్ లు నయన్ తల్లితో కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను నయనతార సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Advertisement
అయినప్పటికీ సొంత కూతురి వివాహానికి నయనతార తల్లి హాజరు కాకపోవడం ఏంటని కోలీవుడ్ ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక పెళ్లి తర్వాత నయనతార విగ్నేష్ తో కలిసి కేరళ లోని అన్ని ఆలయాలను సందర్శిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల నయన్ విగ్నేష్ తో కలిసి తిరుపతిలో దర్శనం చేసుకుంది. అయితే వారు దర్శనానికి వచ్చినప్పుడు నయనతార చెప్పులు వేసుకుని రావడం కలకలం రేపింది. దాంతో నయన్ పై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
Advertisement
ఈ ఘటనపై నయనతార తప్పు తమదేనని తెలియకుండా జరిగిపోయిందని క్షమాపణలు కోరింది. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే పెళ్లికి ముందు తన భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. అయితే నయనతార ఫ్యూచర్ లో ఇతర దర్శకులతో హీరోలతో పని చేస్తుందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.