సినిమా ఇండస్ట్రీలోని హీరో హీరోయిన్, డైరెక్టర్ హీరోయిన్ పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అదే లిస్ట్ లోకి వెళ్తున్నారు నయనతార విఘ్నేష్. చాలా రోజులుగా ఈ జంట ప్రేమలో మునిగిపోయింది. ఎక్కడికి వెళ్లిన కలిసి వెళ్లడం వంటి పనులు చేస్తూ.. ఇంకా ఎప్పుడు పెళ్లి అని అభిమానుల ప్రశ్నకు దమాధానము ఇచ్చేసారు. ఈ మధ్యే ఈ జంట తన పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లికి ముందు ఇప్పుడు వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. అదేంటని వీరు ఒక్కరికి ఒక్కరు ఇచ్చుకునే బహుమతులు.
Advertisement
పెళ్లి సందర్భంగా ఈ జంట ఒక్కరికి మరొక్కరు చాలా ఖరీదైన బహుమతులు ఇచ్చుకోబోతున్నారు అని తెలుస్తుంది. నయనతార తనకు కాబోయే భర్త విఘ్నేష్ కు ఓ ఇంటికి బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే వీరు ప్రేమలో ఉనప్పటినుండే నయన్ ఈ ఇంటిని రెడీ చేస్తుందట. అన్ని సౌకర్యాలు ఉండే ఈ ఇంటి నిర్మాణానికి ఏకంగా 20 కోట్లు ఖర్చు చేసిందట నయన్.
Advertisement
ఇక విఘ్నేష్ కూడా నయన్ కు ఏ మాత్రం తగ్గడం లేదు. మొదట పెళ్లి సమయంలో ఓ ఖరీదైన ఉంగరం ఇవ్వనున్న విఘ్నేష్ పెళ్లి తర్వాత నయన్ కోసం కొన్న కోట్ల విలువ చేసే నగలను ఇవ్వబోతున్నాడు అని తెలుస్తుంది. నయన్ కూడా పెళ్లి తర్వాత ఆ ఇంటికి విఘ్నేష్ పేరుకు మార్చబోతుంది అని సమాచారం. ఇక పెళ్లి తరువాత ఈ జంట విఘ్నేష్ గిస్త్ ఇచ్చిన ఇంట్లో కాపురం పెట్టబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్నో రోజులుగా ఎదురు చుసిన ఈ జంట తమ పెళ్లి కోసం కూడా కోట్లలో ఖర్చు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :