Telugu News » Blog » గడ్డం తెల్లబడింది పెళ్లి చేసుకోవాలన్న నెటిజన్…స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నవదీప్…!

గడ్డం తెల్లబడింది పెళ్లి చేసుకోవాలన్న నెటిజన్…స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నవదీప్…!

by AJAY
Ads

చిత్ర పరిశ్రమలో కొంత మంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే మరికొంతమంది మాత్రం ఏజ్ పెరిగినా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో నవదీప్ కూడా ఒకరు. నవదీప్ ఒకప్పుడు హీరోగా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. కానీ ఇప్పుడు నవదీప్ హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేస్తూ అలరిస్తున్నాడు. అదే విధంగా గా టీవీ షోలలోనూ నవదీప్ సందడి చేస్తున్నాడు.

Ads
Navadeep

Navadeep

రీసెంట్ గా అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠ పురం సినిమా లో అల్లు అర్జున్ కు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత మోసగాళ్లు సినిమాలోనూ మంచు విష్ణుకు ఫ్రెండ్ గా నటించాడు. ప్రస్తుతం నవదీప్ రమాదేవి అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే సినీ పరిశ్రమలో ఏజ్ పెరిగిన ప్రతి సెలబ్రిటీ కి ఎదురయ్యే ప్రశ్ననే ఇప్పుడు నవదీప్ కు కూడా ఎదురవుతోంది.

Ads

టీవీ షోలలో నవదీప్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటూ అతడిపై పంచ్ లు వేస్తున్నారు. అదేవిధంగా నవదీప్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ యాక్టివ్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. అయితే తాజగా ఓ నెటిజన్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావన్నా గడ్డం తెల్లబడుతుంది అంటూ కామెంట్ చేశాడు. దానికి నవదీప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. గడ్డం తెల్లబడిపోతుందని పెళ్లి చేసుకోండి కొంతమంది సలహాలు ఇస్తున్నారని గడ్డం తెల్లబడితే ట్రిమ్ చేసుకోవాలని పెళ్లి కాదని అన్నారు. దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీక్కోలేం కదా అంటూ రిప్లై ఇచ్చాడు.

 

Ad