Home » అతనితో రష్మిక మందన వీడియో కాల్‌…అడ్డంగా దొరికిపోయిందిగా ?

అతనితో రష్మిక మందన వీడియో కాల్‌…అడ్డంగా దొరికిపోయిందిగా ?

by Bunty
Ad

నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తాను నటించిన మొదటి సినిమాతోనే ఎంతోమందిని తన వైపుకు తిప్పుకుంది. ఇక పుష్పా సినిమాతో నేషనల్ క్రష్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రష్మికకు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. ఆ అభిమానులలో ప్రమోద్ భాస్కర్ కూడా ఒకరు. రష్మికకు అతను వీరాభిమాని. సోషల్ మీడియా వేదికగా రష్మికకు ఎన్నో సార్లు ప్రపోజ్ కూడా చేశాడు.

National crush Rashmika Mandanna surprises a fan at Kaun Banega Crorepati Show

National crush Rashmika Mandanna surprises a fan at Kaun Banega Crorepati Show

 

వాటికి రష్మిక చాలా ఫన్నీగా అతనికి రిప్లై కూడా ఇస్తోంది. అంతేకాకుండా తన సినిమాలన్నీ చూస్తానని, తన నటన చాలా బాగుంటుందని చెప్పుకొచ్చాడు. తాజాగా రష్మిక ప్రమోద్ తో వీడియో కాల్ మాట్లాడి అతనికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. ఇదంతా బిగ్ బి అమితాబచ్చన్ సమక్షంలో జరిగింది. అమితాబచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోర్ పతి షోలో భాగంగా జరిగింది. ఈ షోలో ప్రమోద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మనసులో మాటని అమితాబచ్చన్ తో పంచుకున్నాడు ప్రమోద్. రష్మిక అంటే నాకు ఎంతో ఇష్టం. తన సినిమాలను చూస్తూ ఉంటాను.

Advertisement

తనకు చాలా సార్లు ప్రపోజ్ చేశాను అని చెప్పుకొచ్చాడు. ఇక అమితాబచ్చన్ వెంటనే రష్మికకు వీడియో కాల్ చేయించారు. ప్రమోద్ తో మాట్లాడించారు. ఫోన్ కాల్ లో భాగంగా మిమ్మల్ని పర్సనల్ గా కలిసి మాట్లాడాలని ఉందని ప్రమోద్ చెప్పాడు. దానికి రష్మిక స్పందిస్తూ తప్పకుండా కలుస్తానని చెప్పింది. ఈ షోలో నా అభిమాని పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని రష్మిక వెల్లడించారు. ఈ క్రమంలో అమితాబచ్చన్… రష్మికపై ప్రశంసల వర్షం కురిపించారు. రష్మిక నటించిన ప్రతి ఒక్క సినిమాను చూస్తున్నానని, యానిమల్ సినిమాలో చాలా అద్భుతంగా నటించావంటూ అమితాబ్ పొగిడారు. తన నటనను మెచ్చుకోవడంతో రష్మిక తెగ సంబరపడిపోయింది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading