టాలీవుడ్ సినీ కార్మికులు మా జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయని తమ వేతనాలు పెంచాలని ఓ వైపు డిమాండ్ చేస్తున్నారు. షూటింగ్‌లకు దూరంగా ఉండాలని రెండు యూనియన్లు డిమాండ్ చేస్తున్న తరుణంలో తాజాగా నరేష్ స్పందించారు. ఈ సమస్యలపై సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు నరేష్. అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోతాయని, ఒకటి రెండు యూనియన్లు వేతనాలు పెంచకపోతే షూటింగ్ ఆపేస్తామని పోరాటం చేస్తున్నారు. పోరాటం చేయడం మంచిదే కానీ మనందరం ఒకటి గుర్తుంచుకోవాలి. గత మూడు సంవత్సరాలుగా దాదాపు కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచంతో పాటు సినీ పరిశ్రమ అట్టడుగుకు వెళ్లిపోయింది. కార్మికులు, చిన్న చిన్న ఆర్టిస్ట్‌లు పూటకు కూడా గతి లేకుండా నానా ఇబ్బందులు పడి మెడికల్ ఖర్చులు లేకుండా ఎంతో మంది ప్రాణాలను సైతం కోల్పోయారు. ఇప్పుడిప్పుడే వెంటిలెటర్ పై ఊపిరి పీల్చుకుని సినిమాలు విడుదల అవుతున్నాయి.
Advertisement
Advertisement
తెలుగు సినీ పరిశ్రమకు దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు వస్తుంది. బ్యాంకులు నిండకపోయినా కనీసం కంచాలు నిండుతున్నాయని, ఇలాంటి పరిస్థితిలో మనందరం ఆలోచించాలి. చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఓ వైపు నిర్మాతలు, మరొకవైపు దర్శకులు, ఆర్టిస్ట్‌లు, కార్మికుల నుంచి ఇలా చాలా మంది నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి అని నరేష్ వెల్లడించారు. మేము చాలా వరకు మునిగిపోతాం అని, వేతనాలు ఎంతో కొంత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు కూడా కరోనా సమయంలో కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించని పరిస్థితి నెలకొంది.
తొందరపాటు లేకుండా కొద్దిగా సమయం తీసుకొని ఫెడరేషన్‌కు, ప్రొడ్యూసర్లకు ఇబ్బంది కలగకుండా అందరం కలిసి ఎక్కడో ఒక పాయింట్‌కి రావడం పెద్ద కష్టం కాదు. కృష్ణానగర్‌కి, ఫిల్మ్‌నగర్‌కి మధ్య ఉన్న దూరం 3 కిలోమీటర్లు. మనందరం కలిస్తేనే ఓ కుటుంబం. అందరం కలిసి దీనిని పరిష్కరించుకోవాలి. కచ్చితంగా సినీ ఇండస్ట్రీ బిడ్డగా నా వంతుగా నేను ఏమి చేయాలో అది చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. పెద్దలందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకుని సినీ పరిశ్రమను అంధకారంలోకి వెళ్లకుండా ఆపి షూటింగ్‌లు కొన్ని రోజులు ముందుకు సాగేవిధంగా అందరం కలిసి ఒక నిర్ణయానికి వస్తే మంచిది అని కోరుతున్నట్టు చెప్పారు నరేష్.
Also Read :
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఇది ఫాలో అయితే కచ్చితంగా తగ్గుతారు
ఆ సమయంలో నాన్న జేబులో 200 ఉన్నాయట.. ఆకాష్ పూరి కామెంట్స్ వైరల్..!