Home » నన్ను చంపడానికి సుపారీ ఇచ్చింది…మాజీ భార్య పై నరేష్ సంచలన ఆరోపణలు…!

నన్ను చంపడానికి సుపారీ ఇచ్చింది…మాజీ భార్య పై నరేష్ సంచలన ఆరోపణలు…!

by AJAY

మాజీ భార్య రమ్యా రఘుపతి పై వీకే నరేష్ సంచలన ఆరోపణలు చేశాడు. తన రమ్యా రఘుపతి, రోహిత్ శెట్టి లతో తనకు ప్రాణహాని ఉందని నరేష్ కోర్టును ఆశ్రయించాడు. ఆస్తికోసం రమ్యా రఘుపతి తనను చంపాలని చూసిందని ఆరోపించాడు. తన కు తెలిసిన పోలీస్ ఆఫీస్ ఆఫీసర్ సహాయం తో తన ఫోన్ ను హ్యాక్ చేశారని నరేష్ ఆరోపించాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నుండి రమ్యా తనని వేధింపులకు గురి చేసిందని అన్నాడు.

తన తల్లి తో కలిసి బెంగుళూరు లోనే ఉండాలని వేధించేదని చెప్పాడు. అంతే కాకుండా తనను చంపడానికి సుపారీ గ్యాంగ్ కు సుపారి కూడా ఇచ్చిందని ఆరోపించాడు. తన పేరు చెప్పి కొన్ని బ్యాంకులు కొంతమంది వ్యక్తుల దగ్గర రమ్య డబ్బులు వసూలు చేసిందని నరేష్ తెలిపాడు. పెళ్లి తరవాత తాను ఒక్కరూపాయి కూడా కట్నం తీసుకోలేదు అని అన్నారు.

తనను చంపేస్తారు అన్న భయం తో ఎక్కడికీ వెళ్ళడం లేదని తెలిపారు. అంతే కాకుండా కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి తో కూడా తనకు బెదిరింపులు వచ్చాయని చెప్పారు. కొడుకు పుట్టిన తరవాత కుడా రమ్య లో ఎలాంటి మార్పు రాలేదని నరేష్ అన్నారు. ఇదిలా ఉండగా నరేష్ టాలీవుడ్ నటి పవిత్రా లోకేష్ తో సహా జీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది ప్రారంభం లో పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకుంటా అని కొత్త జీవితం లోకి అడుగుపెడుతున్నాము అని కూడా నరేష్ ఒక వీడియో ను విడుదల చేశారు. ఇక రమ్యా రఘుపతి నరేష్ కు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని చెబుతున్న సంగతి తెలిసిందే.

Also read : Hunt Review : సుధీర్ బాబు నమ్ముకున్న ట్విస్ట్ తో అలా జరిగిందా..?

Visitors Are Also Reading