నారా భువనేశ్వరిపై వైసీపీ పార్టీ కీలక నేత, మహిళా, శిశు సంక్షేమ ప్రభుత్వ సలహాదారు నారమిల్లి పద్మజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మహిళా, శిశు సంక్షేమ ప్రభుత్వ సలహాదారు నారమిల్లి పద్మజ మీడియాతో మాట్లాడుతూ….మంత్రి రోజా పై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను భువనేశ్వరి, బ్రాహ్మణి ఎందుకు ఖండించటం లేదు ?? అని అగ్రహించారు.
అవినీతి కేసులో అడ్డంగా దొరికి చంద్రబాబు జైల్లో ఉంటే మహిళా నాయకులం అంటూ భువనేశ్వరి, బ్రాహ్మణి రోడ్డు మీదకు వచ్చారని చురకలు అంటించారు. సాటి మహిళ పట్ల మీ పార్టీ నాయకులే నీచంగా మాట్లాడితే ఆనందిస్తారా?? అని అగ్రహించారు మహిళా, శిశు సంక్షేమ ప్రభుత్వ సలహాదారు నారమిల్లి పద్మజ.
Advertisement
Advertisement
కన్న తండ్రి ఎన్టీఆర్ ను భర్త వెన్నుపోటు పొడవటంలో నారా భువనేశ్వరి పాత్ర కూడా ఉందని అనుమానం వస్తుందని నారమిల్లి పద్మజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చానని పవన్ చెబుతున్నారు… చంద్రబాబు కేసులతో ప్రభుత్వానికి సంబంధం లేదని వెల్లడించారు. ప్రాథమిక ఆధారాలతో కోర్టు చంద్రబాబును జైల్లో పెట్టిందని చెప్పారు. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తెలియాలని డిమాండ్ చేశారు. జగన్ ఢిల్లీ టూర్‌పై టీడీపీ ఎప్పుడూ తప్పుడు ప్రచారమే చేస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి
- చంద్ర బాబు అరెస్ట్ తరువాత స్కంద సినిమాలో చేసిన మార్పులు ఇవేనా ?
- Temba Bavuma : హే బాబు లే… బవుమాపై ట్రోలింగ్ !
- Pushpa 2 : పుష్ప-2 సినిమాలో ఉర్ఫీ జావేద్ ?