తాజాగా టీడీపీ యువనాయకుడు నారాలోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ తిరుపతిలో యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా వివిధ వర్గాల వారితో లోకేష్ భేటీ అయ్యారు. అంతే కాకుండా అంకుర ఆస్పత్రి సమీపంలో యువతతో నారాలోకేష్ ముచ్చటించారు. హలో లోకేష్ అంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా యువత లోకేష్ కు ఆసక్తికర ప్రశ్నలు వేశారు.
Advertisement
గతంలో బొద్దుగా ఉండేవారు ఇప్పుడు స్లిమ్ అయ్యారు సీక్రెట్ ఏంటి అంటూ యువత ప్రశ్నించగా తాను స్లిమ్ గా అవ్వడానికి కారణం తన అర్థాంగి అంటూ వెల్లడించారు. అంతే కాకుండా ఓ ప్రశ్నకు తాను మెగాస్టార్ ఫ్యాన్ అంటూ ఆన్సర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. రీసెంట్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా చూశానని తాను చిరంజీవి అభిమాని అని చెప్పారు.
Advertisement
అంతే కాకుండా బాలయ్య తన ముద్దుల మావయ్య అని ఆయనను విశేషంగా అభిమానిస్తానని చెప్పారు. బాలా మామ అన్ స్టాపబుల్ అంటూ ప్రశంసలు కురిపించారు. బాలయ్య సినిమా మొదటి షోకు ఉండేది తానే అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్ కావాలని అన్నారు. మన రాష్ట్ర క్రీడాకారులకు జాతీయస్థాయిలో గుర్తింపు రావాలని అన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం అందడం లేదని అన్నారు. తిరుపతిలో క్రీడా విశ్వవిద్వాలయాన్ని ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. గతంలో క్రీడా విశ్వవిద్యాలయం గురించి పుల్లెల గోపిచంద్ తో ప్రశ్నించానని అన్నారు.
ALSO READ :రాజమౌళితో సినిమా చేయాలంటే హీరోయిన్ కచ్చితంగా అందుకు ఒప్పుకోవాల్సిందే..!