Nara Lokesh Jayam Movie: ఏపీ మాజీముఖ్యమంత్రి తనయుడు మాజీ మంత్రి నారాలోకేష్ అంటే తెలియని వారి ఉండరు. అప్పట్లో నారాలోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో చాలా ట్రోల్స్ కు గురయ్యారు. కానీ ఇప్పుడు ఆయన పై ట్రోల్స్ కూడా తగ్గిపోయాయి. అంతే కాకుండా ఒకప్పుడు సాఫ్ట్ గా కనిపించే నారాలోకేష్ ఇప్పుడు మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. సాఫ్ట్ గా కనిపించడమే కాకుండా మాస్ డైలాగులు కొడుతున్నారు. అధికారంలోకి వచ్చాక లెక్క తేలుస్తామంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు.
Advertisement
దాంతో లోకేష్ పై ట్రోల్స్ దాదాపుగా తగ్గిపోయాయి. అంతే కాకుండా ఆయకు అభిమానులు కూడా పెరిగిపోయారు. ఇక ఫారిన్ లో చదువు పూర్తిచేసుకున్న నారా లోకేష్ ఆ తరవాత తిరిగి వచ్చి బాలయ్య కూతురిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నాడు. ఇక ఫారిన్ నుండి వచ్చిన తరవాతనే లోకేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంత్రిగా పనిచేశారు. కానీ 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే…నారాలోకేష్ లో మరో యాంగిల్ కూడా అది చాలా తక్కువ మందికి తెలుసు.
Advertisement
Also read: పుతిన్ ప్రేయసికి ఆ దేశంలో కష్టాలేనట..!
నిజానికి నారాలోకేష్ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరో స్థానంలో ఉండాల్సింది. కానీ ఆయన మొదటి సినిమానే ఆగిపోయింది. నారాలోకేష్ ముందుగా సినిమాల్లోకి రావాలని అనుకున్నారు. అంతే కాకుండా దర్శకుడు తేజతో నారా లోకేష్ సినిమా కూడా కన్ఫామ్ అయ్యింది. అదే నితిన్ హీరోగా నటించిన జయం సినిమా. అయితే ముందుగా ఈ సినిమాకు నారా లోకేష్ ను అనుకోవడంతో పాటూ పూజాకార్యక్రమాలు కూడా పూర్తిచేశారు.
కానీ ఆ తరవాత ఏవో కారణాల వల్ల సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరవాత నారాలోకేష్ పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయారు. ఏమైందో కానీ మళ్లీ సినిమాల వైపు తిరిగి చూడలేదు. ఇక తేజ నిజం సినిమాను నితిన్ సదాలతో తెరకెక్కించగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. లోకేష్ సినిమా హీరో కాకపోయినా రాజకీయ నేతగా కూడా అభిమానులను సంపాదించుకున్నారు.
Also Read: కర్నాటకలో ప్రతి థియేటర్ లో సీటు నంబర్ 17 ఖాళీ….ఎందుకో తెలుసా…!