Home » క‌ర్నాట‌క‌లో ప్ర‌తి థియేటర్ లో సీటు నంబ‌ర్ 17 ఖాళీ….ఎందుకో తెలుసా…!

క‌ర్నాట‌క‌లో ప్ర‌తి థియేటర్ లో సీటు నంబ‌ర్ 17 ఖాళీ….ఎందుకో తెలుసా…!

by AJAY
Ad

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణించి నెలలు గడుస్తున్నా ఆయన మరణ వార్తను అభిమానులు, కన్నడ ప్రజానీకం ఇంకా మర్చిపోలేదు. ఇప్పటికీ పునీత్ రాజ్ కుమార్ ను తలుచుకుంటూ బాధపడుతున్నారు. కాగా పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా జేమ్స్ ఈనెల‌17 న విడుదలైన సంగతి తెలిసిందే. దాంతో కర్ణాటకలోని థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది.

puneeth rajkumar

puneeth rajkumar

భారీ కటౌట్లతో అభిమానులు థియేటర్లను ముస్తాబు చేశారు. పాలాభిషేకాలు చేయ‌డం, ట‌పాసులు పేల్చ‌డం ఎక్కడ చూసినా సంబరాలే కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో నాలుగు వేల థియేటర్లలో విడుదల చేశారు. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.

Advertisement

Also Read: Shreyas Iyer : రాహులే నా ఫేవ‌రేట్ కెప్టెన్‌.. ఎవ‌రూ అలా చేయ‌లేదు

Advertisement

సినిమా ఎలా ఉందో పట్టించుకోకుండా అభిమానులు థియేటర్ లకు క్యూ కడుతున్నారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా అన్ని భాషల్లోనూ సినిమా ప్రియులు థియేటర్ లలో సినిమాను చూస్తున్నారు. అంతే కాకుండా కర్ణాటక లో ఈ నెల 25 వరకు అన్ని థియేటర్ లలో జేమ్స్ సినిమా తప్ప మరే సినిమా కూడా విడుదల చేయకూడదు అని తీర్మానం కూడా చేశారు.

మరోవైపు బెంగుళూరులోని ఓ థియేటర్ లో ఉదయం 6గంటల షోకు ఛాయ్ బిస్కెట్లు….మధ్యానం బిర్యానీ అదే విధంగా సాయంత్రం 4 గంటలకు సమోసాలను ఇస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అన్ని థియేటర్ లలో సీటు నంబర్ 17ను ఖాళీగా వదిలిపెడుతున్నారు. కర్ణాటక లోని అన్ని థియేటర్ లలో ఇదేవిధంగా వదిలేస్తున్నారు. అలా సీటు వదిలిపెట్టడానికి ఓ కారణం ఉంది. ఆ సీటులో పునీత్ రాజ్ కుమార్ వచ్చి కూర్చుకుంటారని నమ్ముతున్నారు. పునీత్ వచ్చి ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూస్తారని వాళ్ళ నమ్మకం.

Also Read: రాబోయే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిస్తే టీడీపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో చెప్పిన ఎమ్మెల్యే

Visitors Are Also Reading