తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం పూట అరెస్టు అయిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో అవినీతి జరిగిందని… ఆ అవినీతికి మూల కారణం నారా చంద్రబాబు నాయుడు అని ఆయనను అరెస్టు చేశారు. నిన్న ఉదయం ఆరు గంటల సమయంలో చంద్రబాబును అరెస్టు చేసిన ఏపీ సిఐడి… విజయవాడకు సాయంత్రం వరకు తరలించారు.
ప్రస్తుతం చంద్రబాబు కేసులో కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే చంద్రబాబును కోర్టులో ప్రవేశ పెట్టేముందు…. ఏకంగా 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు అందించారు ఏపీ సిఐడి పోలీసులు. అయితే ఈ రిమాండ్ రిపోర్టులో… నారా లోకేష్ పేరు కూడా చేర్చారు. అతని పేరు చేర్చడంతో పాటు… లోకేష్ ను అరెస్టు చేస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ నారా లోకేష్ ను కూడా అరెస్టు చేస్తే.. తెలుగుదేశం పార్టీ చాలా దెబ్బతింటుంది.
Advertisement
Advertisement
సెంటిమెంట్ గా తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినప్పటికీ… ఏపీలో మరో ఆరు నుంచి 8 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ అరెస్ట్ అవుతే… తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య కూతురు…బ్రాహ్మణిని రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల… ఎంతో కష్టపడి పార్టీని నిలబెట్టిందని… ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి నారా బ్రాహ్మణి అండగా ఉండాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై నారా బ్రాహ్మిని , నారావారి కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
జైలర్ సినిమా మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ?
Ravindar Chandrasekaran : పాపం…నమ్మించి మోసం చేసిన నిర్మాత!
IND VS PAK : టీమిండియా-పాక్ మ్యాచ్ అంటే… మహా భారతమేనా ?