Telugu News » Blog » బిగ్ బాస్ తెలుగు ఓటిటి లోకి నాని హీరోయిన్….!

బిగ్ బాస్ తెలుగు ఓటిటి లోకి నాని హీరోయిన్….!

by AJAY
Published: Last Updated on
Ads

ఈ నెల 26 నుండి బిగ్ బాస్ తెలుగు ఓటిటి ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ షో ప్రోమో కూడా వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ ఓటి టి రోజుకు 24గంటలు ప్రసారం కానుండగా ఇప్పటికే కంటెస్టంట్ లు కూడా ఖరారు అయ్యారు. అయితే ఈసారి హౌస్ లోకి ఆవకాయ్ బిర్యానీ హీరోయిన్ బిందు మాధవి వెళుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

బిందు మాధవి ఆవకాయ్ బిర్యానీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. అంతే కాకుండా ఆ తరవాత బంపర్ ఆఫర్ సినిమాలో నటించి కూడా అలరించింది. ఇక ఆ తరవాత రామ్ హీరోగా నటించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో నటించి కూడా ఆకట్టుకుంది.

Advertisement

అంతే కాకుండా బిందు మాధవి నాని హీరోగా నటించిన పిల్ల జమిందార్ సినిమా లో కూడా హీరోయిన్ గా నటించగా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు బిందు మాధవి బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

మరోవైపు ఇప్పటికే హౌస్ ల్లోకి వెళుతున్నారు అంటూ మరి కొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే హౌస్ లో ఎవరు వెళ్ళబోతున్నారు అనేది తెలియాలి అంతే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.

You may also like