Home » నాని ద‌స‌రా ఫస్ట్ రివ్యూ….సినిమాలో అదే హైలెట్ అదేన‌ట‌..!

నాని ద‌స‌రా ఫస్ట్ రివ్యూ….సినిమాలో అదే హైలెట్ అదేన‌ట‌..!

by AJAY
Ad

నాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం ద‌స‌రా. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను గోదావ‌రిఖ‌ని బ్యాక్ డ్రాప్ లో బొగ్గుగ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ నానికి జ‌త‌క‌ట్టింది. అంతే కాకుండా ఈ సినిమా ట్రైల‌ర్ ఇప్పటికే విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ప‌క్కా మాస్ మ‌సాలా ఎంటర్టైన‌ర్ గా ఈ సినిమా ఉండ‌బోతుంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

Advertisement

అంతే కాకుండా ఈ సినిమా నుండి చ‌మ్కీల అంగిలేసి అనే పాట విడుదలై యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక నాని కెరీర్ లోనే ఇది హైబ‌డ్జెట్ సినిమా కావ‌డం విశేషం. ఈ సినిమాను దాదాపు రూ.80 కోట్ల ఖ‌ర్చుతో నిర్మించారు. సినిమాలో పాన్ ఇండియా రేంజ్ స్ట‌ఫ్ ఉండ‌టంతో తెలుగుతో పాటూ ఇత‌ర భాష‌ల్లో కూడా విడుద‌ల చేస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ఈ సినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. కాగా సినిమాకు సెన్సార్ ఇచ్చిన రివ్యూ ఇదేనంటూ రివ్యూ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఆ రివ్యూ ప్ర‌కారంగా చూసిన‌ట్ట‌యితే…ఈ సినిమా విజ‌యం విష‌యంలో సెన్సార్ స‌భ్యులు పాజిటివ్ గా ఉన్నార‌ట‌.

చిత్రంలో నానితో పాటూ కీర్తి సురేష్ న‌ట‌న అద్భుతంగా ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ప్యూర్ ల‌వ్ స్టోరీ అని విలేజ్ పాలిటిక్స్ వ‌ర్గ పోరాట‌ల నడుమ ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ఈ సినిమా పై అంచ‌నాలు నెల‌కొన‌గా సెన్సార్ రిపోర్ట్ తో సినిమా పై అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి. అయితే సినిమా పూర్తి రివ్యూ తెలియాలంటే ఈ నెల 30 వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading