Home » సినిమాలో ఆఫ‌ర్ ఇస్తే అలా చేసింది…సిరిహ‌న్మంత్ పై నంద‌కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

సినిమాలో ఆఫ‌ర్ ఇస్తే అలా చేసింది…సిరిహ‌న్మంత్ పై నంద‌కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by AJAY
Ad

తెలుగులో మంచి సీరియల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు నందకిషోర్. తెలుగులో చాలా సీరియల్స్ లో నటించి నందకిషోర్ ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఆయన రామ సక్కని సీత అనే సీరియల్ లో హీరోగా నటిస్తున్నారు. ఈ సీరియల్ జీ తెలుగులో ప్రసారం అవుతోంది. కాగా ఈ సీరియ‌ల్ కు ఎంతో మంది మ‌హిళ‌లు అభిమానులుగా ఉన్నారు. అయితే రీసెంట్ గా నందకిషోర్ ఓ సినిమాలో హీరోగా కూడా నటించారు. నరసింహపురం అనే సినిమాలో నందకిషోర్ మొదటి సారి హీరోగా నటించారు. ఈ సినిమాలో మన బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంత్ హీరోయిన్ గా నటించింది. అయితే తాజాగా నందకిషోర్ సిరి హ‌న్మంత్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

nandhakishore shocking comments on sirihanmanth

nandhakishore shocking comments on sirihanmanth

ఓ ఇంటర్వ్యూలో నంద‌ కిషోర్ మాట్లాడుతూ… సినిమాలో హీరోయిన్ గా తెలుగు వారికి ఆఫర్లు రావడం చాలా అరుదు అని అన్నారు. కానీ సిరి హ‌న్మంతుకు తామ సినిమా న‌ర‌సింహ‌పురంలో నటించే అవకాశం ఇచ్చామని అన్నారు. అంతేకాకుండా సినిమాలో సిరి హన్మంత్ పాత్ర‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పారు. అయితే సినిమా పూర్తయ్యాక ప్రమోషన్స్ కోసం ఆమెను పిలిచామ‌ని కానీ ఆమె ప్రమోషన్ కు వచ్చేందుకు నిరాకరించిందని నంద‌కిషోర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ట్రైలర్ లో తన క్యారెక్టర్ ను అసభ్యకరంగా చూపించారని…. ప్రేక్ష‌కుల‌కు తనపై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని తాను ప్రమోషన్ కు రానని సిరి హ‌న్మంత్ చెప్పినట్టు తెలిపారు.

Advertisement

Advertisement

సినిమాలో త‌న పాత్ర‌ను మార్చిన‌ట్టు సిరి హ‌న్మంత్ అభిప్రాయపడిందని తెలిపారు. కానీ దర్శకుడు అలా చేయలేదని ఒకసారి సిరి ఆ సినిమా చూస్తే త‌నకే తెలుస్తుందని అన్నారు. దర్శకుడు ఈ సినిమాలో ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్య‌త ఇచ్చార‌ని నంద‌కిషోర్ చెప్పాడు.

సిరి ఇప్ప‌టికీ కూడా ఆ సినిమా చూసి ఉండ‌ద‌ని తాను ఖచ్చితంగా చెప్ప‌గ‌ల‌న‌ని నంద‌కిషోర్ వ్యాఖ్యానించారు. ఇక నంద‌ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారాయి. సిరి ప్ర‌స్తుతం బిగ్ బాస్ లో ఉండ‌టంతో ఆమెపై నంద కిషోర్ చేసిన కామెంట్స్ ఎలాంటి ప్ర‌భావం చూపిస్తోయోన‌ని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.

Visitors Are Also Reading