Home » NTR : ఎన్టీఆర్ చనిపోయే గంట ముందు ఇంత కథ జరిగిందా !!

NTR : ఎన్టీఆర్ చనిపోయే గంట ముందు ఇంత కథ జరిగిందా !!

by Bunty
Ad

 

సీనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని దేశం గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప నటుడు. నటుడుగానే కాకుండా గొప్ప వ్యక్తిగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనిమంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఇండస్ట్రీలో ఎంతమంది గొప్ప నటులు వచ్చినప్పటికీ ఎన్టీఆర్ కి ఉన్న గుర్తింపు అస్సలు పోదు. ప్రజల గుండెల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు.

Advertisement

అంతటి గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇక ఎన్టీఆర్ మరికొద్ది గంటల్లో చనిపోతాడనే ముందు చివరిగా తన ప్రాణ స్నేహితుడైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు తో ఫోన్లో మాట్లాడారట. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఇద్దరు ప్రాణ స్నేహితులు అన్న విషయం చాలామందికి తెలుసు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంత గొప్ప స్థాయికి రావడానికి ఒకప్పుడు వీరిద్దరు చేసిన సాహసం అనే చెప్పాలి. వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు. కానీ వీరిద్దరి స్నేహాన్ని తట్టుకోలేక ఇండస్ట్రీలో కొంతమంది వీరిద్దరి మధ్య చిచ్చులు, గొడవలు పెట్టారు. దాంతో వారిద్దరూ దూరం అయ్యారు. ఇక ఎన్టీఆర్ చనిపోయే ముందు నాగేశ్వరరావుకి ఫోన్ చేసి నాకు నీతో మాట్లాడాలని ఉంది.

Advertisement

నీతో కలిసి భోజనం చేయాలని ఉంది. ఇంటికి వస్తావా అని ఫోన్ చేసి అడిగారట. అయితే నాగేశ్వరరావు కూడా వెంటనే వస్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేశారట. ఇక నాగేశ్వరరావు వెంటనే బయలుదేరి ఎన్టీఆర్ వద్దకి చేరుకునేలోపే ఎన్టీఆర్ ప్రాణాలు విడిచారట. ఈ విషయం తెలిసిన అక్కినేని నాగేశ్వరరావు చాలా బాధపడ్డారట. ఈ విషయం అప్పట్లో చాలా వైరల్ గా మారింది. మంచి స్నేహితులు విడిపోవడమేంటి… చివరి క్షణాల్లో కలుసుకోకుండానే ఎన్టీఆర్ మరణించాడని…. ఆయన కోరిక తీరకుండానే చనిపోయాడని చాలామంది బాధపడ్డారట.

ఇవి కూడా చదవండి 

బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?

కీర్తి సురేష్ జాతకం ఇంత ఘోరమా…ఏది ముట్టుకున్నా నాశనమే ?

అన్నగారికి చంద్రబాబు నిజంగానే వెన్నుపోటు పొడిచాడా ? ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

Visitors Are Also Reading