కొన్ని ప్రత్యేక సంవత్సరాలు కొంత మంది హీరోల కెరీర్‌లో మరిచిపోలేనివిగా మిగిలిపోతాయి. ఆ సంవత్సరంలో వారికి బ్రేకు ఇచ్చిన మూవీస్ విడుదలవ్వడమో.. లేక వారి కెరీర్‌ను మార్చే సినిమాలుండడమో ముఖ్య కారణం. ఇలాంటివే బాలకృష్ణ కెరీర్‌లో కొన్ని ఉన్నాయి. కానీ 1986లో మాత్రం వెరి వెరీ స్పెషల్ అనే చెప్పాలి. ఈ సంవత్సరం బాలకృష్ణ గారిని తిరుగులేని స్టార్ గా మార్చింది. అంతేకాదు.. ఈ ఇయర్‌లో తనకు పడిన హిట్ ఇక ఎప్పుడు రిపీట్ కాలేదు. ఈ సంవత్సరం ఏకంగా 6 హిట్స్‌తనఖాతాలో వేసుకున్నాడు. అవి కూడా వరుసగా అంటే డబుల్ హ్యాట్రిక్. మాస్ హీరోగా, క్లాస్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా అన్నింటికి మించి స్టార్ హీరో అని నిలబెట్టింది 1986. ఈ సంవత్సరం బాలయ్య హీరోగా నటించిన మొత్తం 7 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఫిబ్రవరి 07న విడుదలైన నిప్పులాంటి మనిషి సినిమా ఫ్లాప్ అయింది.
ఇక ఫిబ్రవరి 28న ముద్దుల క్రిష్ణయ్య మొదటివారం కోటి రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఒక్క సెంటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడిన ఈ మూవీ.. హిట్ టాక్‌తో 175 రోజులు కూడా ప్రదర్శించబడి సూపర్ హిట్ అయింది. ఆ తరువాత ఏప్రిల్ 15వ తేదీ విడుదలైన సీతారామకల్యాణం బాలకృష్ణకు క్లాస్‌లో మంచిపేరు తెచ్చిపెట్టింది. రోజు 5 షోలతో రెండు కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అప్పట్లో రికార్డునే సృష్టించింది. జులై 2న విడుదలైన అనసూయమ్మగారి అల్లుడు బాలయ్యకు ఫ్యామిలీ అభిమానుల్లో కూడా మంచి క్రేజ్ తెచ్చింది. ఈ సినిమా ట్విన్ సిటీలలో రెండు కేంద్రాల్లో 100 రోజులు ఆడడం అప్పట్లో రికార్డు. ఈ మూవీ హిట్‌తో బాలయ్య హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. ఇక ఆ తరువాత బాలకృష్ణ తరువాత మూవీ దేశోద్ధారకుడు ఆగస్టు 7న విడుదల అయింది. మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈమూవీకి డైరెక్ట్ 100 డేస్ లేకపోయినా షిప్ట్‌లతో వందరోజులు ఆడి హిట్ చిత్రంగా నిలిచింది.
Advertisement
Advertisement
ఆ తరువాత సెప్టెంబర్ 19న విడుదలైన కలియుగ కృష్ణుడు కూడా కమర్షియల్ గా హిట్ అయింది. ఇక ఈ సంవత్సరం బాలయ్య చివరి చిత్రం అపూర్వ సహోదరులు అక్టోబర్ 09న విడుదల అయింది. ఇందులో ఫస్ట్ టైమ్ బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశాడు. ఓపెనింగ్స్ అదరగొట్టి నాలుగు వారాల్లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ రాబట్టుకున్నారు. రెవెన్యూ పరంగా చూస్తే.. ఇది సూపర్ హిట్. షిప్ట్‌లతో మాత్రమే ఈ మూవీ 100 రోజులు పూర్తయింది. ఈ మూవీ విడుదలైన సమయంలో అప్పటి టాప్ స్టార్స్ అందరి సినిమాలు విడుదలయ్యాయి. వాటన్నింటిని తట్టుకుని మరీ ఈ మూవీ సక్సెస్ అవ్వడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఆంధ్ర, తెలంగాణ సీడెడ్ మూడు ఏరియాల్లో కూడా బాలకృష్ణ సినిమాలు వందరోజులు ఆడాయి. ఇక ఏ హీరోకు కూడా ఈ ఫీట్ సాధ్యం కాలేదు. ఇన్ని విశేషాలతో డబుల్ హ్యాట్రిక్ పొందిన బాలకృష్ణ కెరీర్‌లోనే 1986 అపురూపమైనది.
ఇది కూడా చదవండి:
మన టాలీవుడ్ స్టార్ దర్శకుల కూతుర్ల ఫొటోస్ చూసారా ? హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోరు !
మన టాలీవుడ్ స్టార్ దర్శకుల కూతుర్ల ఫొటోస్ చూసారా ? హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోరు !