Home » మూడు నెలల్లో సినిమా ఎలా తీయవచ్చో పుస్తకం రాసిస్తాం.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

మూడు నెలల్లో సినిమా ఎలా తీయవచ్చో పుస్తకం రాసిస్తాం.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

by Anji
Published: Last Updated on

సాధారణంగా సంక్రాంతి పండుగ వేళ సినీ ఇండస్ట్రీలో పోటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ పండుగ రోజు సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఈ ఏడాది పోటా పోటీగా నాలుగు సినిమాలు రాబోతున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఎన్ని సినిమాలు వచ్చినా వీక్షిస్తారు. అయితే అక్కినేని నాగార్జున ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

తాజాగా జరిగిన నా సామిరంగ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. పండుగకు మొత్తం నాలుగు సినిమాలు వస్తున్నాయి. అందులో నా సామి రంగ ఒకటి. నా సామి రంగతో మిగతా గుంటూరు కారం, సైంధవ్, హను-మాన్ సినిమాలన్ని మంచి విజయం సాధించాలని కోరారు.  ముఖ్యంగా మా సినిమాకి స్టార్ కీరవాణి గారు. ఆయన ఇచ్చిన పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయ్యాయి. మూడు నెలల్లోనే పూర్తి చేశామంటే ఆయన, చంద్రబోస్ మా వెనుకాల ఉంటూ మమ్ముల్నీ ప్రోత్సహించడమే కారణం అన్నారు. వీరిద్దరూ సామాన్యులు కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమను తీసుకెళ్లి ఆస్కార్ వేదికపై నిలబెట్టారు.

సాధారణంగా సినిమాని మూడు నెలల్లో సినిమా చేయడం అంత సులభం కాదు. మూడు నెలల్లో సినిమా ఎలా తీయవచ్చో పుస్తకం రాసిస్తాం. ఈ సారి పండుగకు కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీస్ కొడుతున్నాడు అని అభిమానులకు చెప్పాడు నాగార్జున. దర్శకుడు విజయ్ బిన్ని మాట్లాడుతూ.. నా జీవితం మొత్తానికి చాలా ముఖ్యమైన వ్యక్తి నాగార్జున సర్. ఇలాంటి సినిమాలు ఆడితే.. నాలాగే మరో పది మంది దర్శకులను నాగార్జున సర్ పరిచయం చేస్తారని పేర్కొన్నారు. మరోవైపు నా ప్రతిభను ప్రోత్సహిస్తూ.. తనతో పాటు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు కీరవాణి సర్.. ఆయనకు పాదాభివందనాలు అని చెప్పారు చంద్రబోస్. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, రుక్సార్ థిల్లాన్, మిర్నా మేనన్ వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading