టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత నాగచైతన్య గత ఏడాది డిసెంబర్ లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సమంత చైతూ విడాకుల వార్త అభిమానులకు షాక్ ఇచ్చింది. విడాకులకు సమంత నే కారణం అని అక్కినేని అభిమానులు అంటే కాదు కాదు చైతూ వల్లే ఇద్దరికీ విడాకులు అయ్యాయని సమంత అభిమానులు నెట్టింట గొడవపడ్డారు. ఇందులో ఏది నిజమో దేవుడికే తెలియాలి కానీ మొత్తానికి ఇద్దరూ విడిపోయారు.
Advertisement
అయితే విడాకుల తరవాత ఇద్దరూ మళ్లీ కలిసే అవకాశం ఉందంటూ వార్తలు వినిపించినా అవి నిజం కాదని క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంత నాగచైతన్య ఎవరి సినిమాలతో వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. సమంత పుష్ప తో పాన్ ఇండియా లెవల్ లో పరిచయం అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది.
Advertisement
ఇంకా చైతూ బంగార్రాజు తో హిట్ అందుకున్నాడు. అమీర్ ఖాన్ సినిమాలో గెస్ట్ రోల్ తో బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. అంతే కాకుండా థాంక్ యూ అనే మరి సినిమాను కూడా చైతూ పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగార్జున చైతూకి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.
అంతే కాకుండా అమ్మాయిని కూడా వెతకడం ప్రారంభించాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు నాగ చైతన్య తో పాటు అఖిల్ కు కూడా నాగార్జున అమ్మాయిని వెతుకుతున్నారట. ఇక ఇద్దరికీ సంబంధాలు సెట్ అయితే త్వరలోనే పెళ్లి కూడా జరిగే అవకాశం ఉంది. ఇక చైతూ కు పెళ్లి చేస్తే అంత మంచి వాడిని మిస్ చేసుకున్న సమంత కు షాక్ తప్పదు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Also read :
రఘుబాబు తొక్కేశాడని కృష్ణభగవాన్ ఆసక్తికర కామెంట్స్..!