Home » ర‌ఘుబాబు తొక్కేశాడ‌ని కృష్ణ‌భ‌గ‌వాన్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

ర‌ఘుబాబు తొక్కేశాడ‌ని కృష్ణ‌భ‌గ‌వాన్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

by Anji
Ad

టాలీవుడ్ క‌మెడీయ‌న్‌ల‌లో కృష్ణ భ‌గ‌వాన్ ఒక‌రు. అత‌ను ఓ ఊపు ఊపాడు. వెండితెర‌కు మ‌ధ్య‌లో కొద్ది రోజులు దూరంగా ఉన్నాడు. ఆరోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగానే సినిమాల‌కు దూరంగా ఉండాల్సి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఇప్పుడు కృష్ణ‌భ‌గ‌వాన్ బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్నాడు. మొన్న జాతిర‌త్నాలు అనే స్టాండ‌ప్ కామెడీ షో ప్రారంభోత్స‌వంలో కృష్ణ‌భ‌గ‌వాన్ సంద‌డి చేశారు. అత‌ను చేసిన కామెడీ, పంచ్‌లు మామూలుగా లేవు మ‌రీ.

Advertisement

ఆయ‌న‌తో పాటు కొంత మంది క‌మెడీయ‌న్లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు సుమ క్యాస్ షోకి వ‌చ్చారు. పోసాని, హేమ‌, స‌మీర్‌, కృష్ణ భ‌గ‌వాన్ అంద‌రూ క‌లిసి సుమ క్యాష్ షోకు గెస్ట్‌లుగా వ‌చ్చారు. స‌మీర్ అయితే ఇదివ‌ర‌కే ఎన్నోసార్లు క్యాష్ షోకు గెస్ట్‌గా వ‌చ్చాడు. కృష్ణ‌భ‌గ‌వాన్ వేసే పంచ్‌ల‌కు అంద‌రూ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. సుమ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అన్నింటికి ర‌ఘుబాబే ఆన్స‌ర్ చెబుతూ అంద‌రినీ న‌వ్వించేవాడు.

Advertisement


ముఖ్యంగా సుమ మీరు లైఫ్‌లో చాలా ఆశ్చ‌ర్యానికి గురైన సంద‌ర్భాలు ఉన్నాయా అని అడిగింది. ర‌ఘుబాబు ఇంకో ఆవిడ‌కు నంది అవార్డు రావ‌డం అని కృష్ణ‌భ‌గ‌వాన్ స‌మాధానం ఇచ్చాడు. ఇండ‌స్ట్రీలో మిమ్మ‌ల్ని ఎవ‌రైనా తొక్కేయాల‌ని చేశారా..? అని సుమ మ‌రో ప్ర‌శ్న‌ను సంధించ‌గా.. ర‌ఘుబాబే అని కృష్ణ‌బాబు ఆన్స‌ర్ చెప్పాడు. ఎవ‌రైనా ఒక‌రినీ తుక్కు తుక్కు కొట్ట‌మంటే ఎవ‌రినీ కొడ‌తార‌ని సుమ ప్ర‌శ్నించ‌గా..? కృష్ణ‌బాబు ఆన్స‌ర్ చెప్పేలోపే స‌మీర్ అందుకుని.. ఇంకెవ్వ‌రూ ర‌ఘుబాబే అని కౌంట‌ర్ వేశాడు. ఈ విధంగా ఆ షో మొత్తం ఫుల్ కామెడీతో క‌ల‌క‌ల‌లాడింది.

ఇది కూడా చదవండి:

  1. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డు.. ఏంటో తెలుసా..!!
  2. సపోటా పండ్లు తింటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!
  3. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌తో పోటీ ఉందా..? ప్ర‌భాస్ ఆన్స‌ర్ ఇదే…!

     

Visitors Are Also Reading