Home » నాగార్జున రిజెక్ట్ చేసిన కథతో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా…!

నాగార్జున రిజెక్ట్ చేసిన కథతో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా…!

by AJAY
Published: Last Updated on
Ad

సాధారణంగా కొన్ని కథలు ఒక హీరోను దృష్టిలో పెట్టుకొని రాసుకుంటే ఆ తర్వాత అనేక కారణాలవల్ల మరో హీరోతో తెరకెక్కించాల్సి వస్తుంది. అలా టాలీవుడ్ లో చాలా సినిమాలు ఉన్నాయి. అంతెందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఒకటైన బద్రి సినిమాకు కూడా మొదటి ఆప్షన్ పవన్కళ్యాణ్ కాదట.

Advertisement

 

బద్రి సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత కొన్ని ఏళ్ల పాటు డేటింగ్ లో ఉండి వివాహం చేసుకున్నారు. ఈ విషయం పక్కన పెడితే…. బద్రి సినిమాను విజయలక్ష్మి మూవీస్ బ్యానర్ పై టీ. త్రివిక్రమరావు నిర్మించారు.

Advertisement

2000 సంవత్సరంలో ఏప్రిల్ 20న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మేనరిజం ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలోని సాంగ్స్ బాగుండటం…. పవన్ రేణు దేశాయ్ మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వడం ఇలా చాలా ప్లస్ పాయింట్ లతో సినిమా ఘనవిజయం సాధించింది. అయితే ఈ సినిమాకు ముందుగా పూరి జగన్నాథ్ నాగార్జున ను అనుకున్నారట. పూరి ఆర్జీవీ వద్ద శిష్యరికం చేసిన సంగతి తెలిసిందే. ఆర్జివి నాగార్జున మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడంతో పూరి నాగార్జునను ఊహించుకుని కథను రాసుకున్నారు.

ఆ తర్వాత నాగార్జున వద్దకు వెళ్లి కథ వినిపించారు. కానీ అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దాంతో పూరి జగన్నాథ్ వరుస హిట్లతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ కు ఈ కథను వినిపించారు. పవన్ కూడా కథలో కొన్ని మార్పులు చేయాలని కోరారు. పూరీ క్లైమాక్స్ మాత్రం మార్చనని తెగేసి చెప్పారట. అయినప్పటికీ పవన్ ఓకే చెప్పారు. అలా బద్రి సినిమాకు నాగ నో చెప్పడం తో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి హిట్ అందుకున్నారు.

Also read :

ఆ మాజీ మంత్రికి ప్రశాంత్ నీల్ దగ్గరి బంధువు అన్న సంగతి తెలుసా ….!

కేజీఎఫ్ ఎఫెక్ట్‌.. వైర‌ల్‌ అవుతున్న వెడ్డింగ్ కార్డుపై వ‌య‌లెన్స్ డైలాగ్..!

Visitors Are Also Reading