Home » నాగార్జున క‌ల్ట్ క్లాసిక్… మ‌న్మథుడు సినిమా ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసా?

నాగార్జున క‌ల్ట్ క్లాసిక్… మ‌న్మథుడు సినిమా ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసా?

by Azhar
Ad

నాగార్జున క‌ల్ట్ క్లాసిక్… మ‌న్మథుడు సినిమా ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసా?క‌రెంటు తీగ‌లు ఎక్కి ఆడుకుంటానంటావేంట‌య్యా కాకిలా మాడిపోతావ్‌..పెళ్ళంటే నూరేళ్ళ పంట కాదు ఎవ్రీడే మంట‌. మీకు నీళ్ళు అంటే భ‌యం..నాకు మా ఆవిడ అంటే భ‌యం.. ముందు న‌న్ను మా ఆవిడ ప్రేమించింది. ఆ త‌ర్వాత నేను ప్రేమించాల్సి వ‌చ్చింది. ఇవ‌న్నీ మ‌న్మ‌థుడు సినిమాలోని డైలాగులు. సినిమా వ‌చ్చి ప‌దిహేడేళ్ళు గ‌డిచినా ఇప్ప‌టికీ ఆ డైలాగులు మ‌న‌ల్ని మీమ్స్ రూపంలో వెంటాడుతున్నాయంటే..ఆ డైలాగుల్లో అంత మ్యాజిక్ ఉంద‌న్న‌మాట‌. సింపుల్‌గా ఆ డైలాగుల్లో అర్ధం చేసుకున్నోడికి అర్ధం చేసుకున్నంత అన్న‌ట్లు ఉంటుంది. పెళ్లి విష‌యంలో నాగార్జున హిత‌బోద‌ల నుంచి పంచ్ డైలాగుల వ‌ర‌కు అదిరిపోయే రేంజ్‌లో ఉంటాయి. ఇక ఈ సినిమా టైటిల్ నాగార్జున‌కి ప‌ర్‌ఫెక్ట్ మ్యాచింగ్ టైటిల్ అని కూడా చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమా చూసి కేవ‌లం మ‌న జ‌న‌రేష‌న్ మాత్ర‌మే కాదు మ‌న త‌ర్వా త జ‌న‌రేష‌న్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు అన్న‌ది ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. అస‌లు మ‌న్మ‌ధుడు సినిమా తలుచుకుంటేనే మ‌న‌సులోనే న‌వ్వుకునే వారు చాలా మందే ఉన్నారండోయ్‌.

Advertisement

ఇప్ప‌టికీ మ‌న్మ‌ధుడు సినిమా టీవీలో వ‌స్తుంటే ఆ ప‌క్క ఛాన‌ల్‌లో వ‌చ్చే సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా అయినా స‌రే ఛాన‌ల్ మార్చ‌కుండా చూస్తూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. 2002 డిసెంబ‌ర్ 22న విడుద‌ల‌యిన ఈ సినిమాలోని కొన్ని ఇన్న‌ర్ విష‌యాల‌ను తెలుసుకుందాం. 2001వ సంవ‌త్స‌రం నువ్వునాకు న‌చ్చావ్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్‌. త్రివిక్ర‌మ్, భాస్క‌ర్ లు ఇద్ద‌రూ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఎందుకంటే ఇది వారికి స్వ‌యంవ‌రం, నువ్వేకావాలి త‌ర్వాత వ‌చ్చిన మూడ‌వ హిట్‌. ఏమి శ్రీను నెక్స్ట్ ఏమి సినిమా చేద్దాం అన్నాడు విజ‌య్‌భాస్క‌ర్ త్రివిక్ర‌మ్‌తో త్రివిక్ర‌మ్ వెంట‌నే నా ద‌గ్గ‌ర రెండు క‌థ‌లున్నాయి. కానీ నాకు కూడా ద‌ర్శ‌క‌త్వం చేయాల‌ని ఉంది భాస్క‌ర్ అన్నారు. అలాగ‌ని రెండు క‌థ‌లు నేను ఉంచుకుని నీకు ద్రోహం చెయ్య‌ను. అందుక‌ని ఏమి చేద్దాం నువ్వే చెప్పు అన్నారు త్రివిక్ర‌మ్‌. దీనికి ఇంత ఆలోచించ‌డం దేనికి నువ్వే నువ్వే క‌థ‌ను హీరో త‌రుణ్‌ని పెట్టి నువ్వే తియ్యి. రెండో క‌థ‌ని నేను ఎవ‌రినైనా హీరోగా పెట్టి తీస్తాను. త‌రుణ్ అంటే ఆల్రెడీ నీ డైలాగుల‌కు సింక్ అవుతాడు అన్నారు. ప్రేక్ష‌కులు కూడా ఆద‌రిస్తారు.

Advertisement

అంతేకాకుండా నువు కొత్త క‌దా మిగ‌తా అన్ని క్రాఫ్ట్స్‌లో కొత్త‌వాళ్ళ‌ని పెట్టుకో స‌రిపోతుంది అన్నారు విజ‌య్‌భాస్క‌ర్‌. త్రివిక్ర‌మ్‌కి కూడా త‌న స‌ల‌హా న‌చ్చి. స‌రే మ‌రి నీ సంగ‌తేంటి అన్నారు త్రివిక్ర‌మ్‌. నాదేముంది. ఇద్ద‌రుముగ్గురిని క‌లిసి క‌థ చెపుతాను నువు రాసిన క‌థ అంటే ఖ‌చ్చితంగా ఒప్పుకుంటారు. త్రివిక్ర‌మ్ క‌థ‌ను విజ‌య్‌భాస్క‌ర్‌కి చెప్పి దీనికి టైటిల్ మ‌న్మ‌ధుడు అని పెడితే బావుంటంది భాస్క‌ర్ అన్నారు. ఇక క‌థ వింటున్న‌ప్పుడే వ‌జ‌య్‌భాస్క‌ర్ చాలా ఎంజాయ్ చేశారు. మ‌న్మ‌ధుడు అంటే మ‌న టాలీవుడ్‌లో ఒక్క‌నాగార్జున మాత్ర‌మే స‌రిపోతారు. కాని దీనికి ఆయ‌న ఒప్పుకుంటారో లేదో అన్న‌దే సందేహం అన్నారు భాస్క‌ర్‌. నాగార్జున అప్ప‌టికే సంతోషం సినిమాకి బాలీవుడ్ మూవీ అగ్నివ‌ర్ష‌కి డేట్స్ ఇచ్చారు. నాగార్జున‌కి క‌థ చెప్పి చూద్దామ‌ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఏ ట్యాలెంట్ ఉన్నా ముందుగా ఎంక‌రేజ్ చేసేది కింగ్ నాగార్జునానే.

త్రివిక్ర‌మ్ క‌థ చెప్ప‌డం మొద‌లు పెట్టే ముందు నాగార్జున‌తో సినిమా టైటిల్ మ‌న్మ‌ధుడు కానీ హీ హేట్స్ ఉమెన్ అన్నాడు. దాంతో నాగార్జున ఇదేంటి మ‌న్మ‌ధుడు అని మ‌ళ్ళీ ఇలా అంటాడు అని ఫేస్ అదోలా పెట్టారు నాగార్జున స‌రే క‌థ విందామ‌ని పూర్తిగా రెండు గంట‌ల సేపు క‌థ వింటారు. విని ఓకే బావుంది చేద్దాం అన్నారు. వెంట‌నే వీరిద్ద‌రూ ఆనంద‌ప‌డ్డారు. కానీ ప్రొడ్యూస‌ర్ ఎవ‌ర‌ని మ‌న‌ద‌ప‌డుతుంటే నాగార్జున ప్రొడ్యూస‌ర్ గురించి వ‌ర్రీ అవ్వ‌కండి నేనే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తా అంటూ మీరు మిగ‌తా క్యాస్టింగ్ ప‌నులు మొద‌లు పెట్టండి అన్నారు. ఇక మ‌న్మ‌ధుడు త‌ర్వాత‌నే గ్యాప్‌లేకుండా చాలా సినిమాలు నిర్మించి హిట్లు సాధించారు. ఇక మంచి సినిమాటోగ్రాఫ‌ర్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా దేవిశ్రీ‌ప్ర‌సాద్‌ని తీసుకున్నారు. మ‌న్మ‌ధుడు 2 కూడా తీశారు కానీ ఆ సినిమా అట్ట‌ర్‌ఫ్లాప్ అయింది. మ‌న్మ‌థుడు చిత్రంలో ఎంత మంచి క్లీన్ కామెడీ ఉందో.. మ‌న్మ‌ధుడు 2లో వ‌ల్గ‌ర్ కామెడీ పెట్టి అన‌వ‌స‌రంగా సినిమా ప‌రువు తీశారు అనిపించింది. పైగా కొంత మంది నాగార్జున ఏజ్‌ని కూడా గ‌మ‌నించి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు.

Also Read: అన్న‌పూర్ణ స్టూడియో నిర్మాణానికి హీరో కృష్ణే కార‌ణ‌మా?

Visitors Are Also Reading