ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగబోతున్నాయి. అదే రోజు లోక్ సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచార వ్యూహాల్లో నిమగ్నమైపోయి ఉన్నాయి ప్రజల నాడి అర్థం కాకపోయినప్పటికీ ఏ పార్టీ కి ఆ పార్టీ జోరుగా వ్యవహరిస్తోంది. రోజు రోజుకీ రాజకీయాలు హీట్ ఎక్కి పోతున్నాయి. ఎన్నికల వాతావరణం అనుకూలంగా ఉందని ప్రచారం చేసుకుంటున్నాయి. నందమూరి బాలకృష్ణ టీడీపీ తరఫున హిందూపురం నియోజకవర్గం నుండి బరి లోకి దిగారు. అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
రోజా నగరి నియోజకవర్గంలో అదృష్టని పరీక్షించుకోబోతున్నారు. పరిశ్రమలో పెద్దలుగా చలామణి అవుతున్న వాళ్లకి మద్దతుగా ఉండే వాళ్లంతా ఈ ఎన్నికల్లో వారి తరఫున ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన సోషల్ మీడియా విభాగం ద్వారా పరిశ్రమకు చెందిన ప్రముఖులు పలువురు పలు పార్టీలకు ప్రచారం చేస్తూ మద్దతుని ఇస్తున్నారు అని చాలా వార్తలు వస్తున్నాయి.
Advertisement
Also read:
Also read:
నాగార్జున ని కూడా ఒక పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం వదిలిపెట్టలేదు ఒక రాజకీయ పార్టీకి నాగార్జున మద్దతిస్తున్నారని వార్తలు తెగ షికార్లు కొడుతున్నాయి అది తప్పుడు ప్రకటనని సినీ ఆర్టిస్టుల సంఘం నుండి సమాచారం వచ్చింది. ప్రిన్స్ మహేష్ బాబు వంటి స్టార్లని కూడా పార్టీలు వాడుకుంటున్నాయి. ఇలాంటివి నమ్మద్దని అభిమానుల సైతం ప్రజల్ని వేడుకుంటున్నారు ఇటువంటి ఫేక్ ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలి అని అందరూ అంటున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!