Home » టబుకి నాగార్జున పెట్టిన ముద్దు పేరు ఏమిటో తెలుసా..?

టబుకి నాగార్జున పెట్టిన ముద్దు పేరు ఏమిటో తెలుసా..?

by Sravya
Ad

నాగార్జున టబు పలు సినిమాల్లో కలిసి నటించారు. ఇద్దరు జోడి కి కూడా మంచి పేరు వచ్చింది. టబు నటించింది కొన్ని సినిమాలైనా కూడా ఆమె హవా కొంతకాలం వరకు నడిచింది. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. గ్లామర్ డాల్ గా చాలామంది హృదయాలను కొల్లగొట్టింది. టబు ఆమె అందరినీ అభిమానులుగా మార్చేసుకుంది. తర్వాత టాలీవుడ్ కి దూరమైనా ఇప్పటికీ ఆమెని ఆరాధించే అభిమానులు ఉన్నారు అంటే అందులో సందేహం లేదు. ఆమె తన అందంతో నటనతో అందరిని కట్టిపడేసింది.

Advertisement

Also read:

హిందీలో కూడా ఎక్కువగా ఈమె సినిమాల్లో నటించింది. హైదరాబాద్ కి చెందిన టబు మొదట బాలీవుడ్ కి వెళ్లి అక్కడ పలు సినిమాలు చేసింది. కూలి నెంబర్ వన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చింది వెంకటేష్ తో కలిసి అదరగొట్టింది. తొలి మూవీతోనే హిట్ ని అందుకుంది. తర్వాత నాగార్జున నిర్మించిన సిసింద్రీ సినిమాలో గెస్ట్ రోల్ చేసింది ఇందులో అఖిల్ చిన్నప్పుడే నటించాడు. టబు ఈ టైంలో తెలుగు ఆడియన్స్ కి దగ్గర అయింది. తెలుగు మేకర్స్ దృష్టిలో పడింది. కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడుతా సినిమా కోసం ఎంపిక చేశారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా గా వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనకి తెలుసు. నాగ్ రొమాన్స్ కి టబూ అందం తోడవడంతో మూవీ హిట్ అయింది తెలుగు ఆడియన్స్ కి సినిమా బాగా నచ్చింది. ఇద్దరి మధ్య మంచి అనుబంధం కూడా ఏర్పడింది. వీళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారన్న వార్తలు కూడా వచ్చాయి. పండు అని టబు కి నాగార్జున ముద్దు పేరు పెట్టారు కూడా.

Advertisement

Amala about Akkineni Nagarjuna

Amala about Akkineni Nagarjuna

Also read:

నెక్స్ట్ మూవీ కూడా నాగార్జున టబుతోనే చేశారు. ఆవిడ మా ఆవిడ సినిమాతో మరోసారి జంట మెప్పించారు. వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ కూడా వచ్చాయి నాగార్జున ప్రేమలో పడడం వల్లే ఆమె పెళ్లి చేసుకోలేదని పుకార్లు వచ్చాయి. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఆ వార్తలు వస్తూ ఉంటాయి హైదరాబాద్ కి టబు వస్తే నాగార్జున ఇంటికి వెళుతుందని అంతటితో ఆగకుండా నాగార్జున ఇంటి ఎదురుగా తాను ఇల్లు కొనుక్కుందని ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే తనతో ఫ్రెండ్షిప్ కి మించిన బంధం అని ఆమె తన ఫ్యామిలీలో మెంబర్ అని అమలతో చాలా క్లోజ్ గా ఉంటుందని నాగార్జున చెప్పారు. ఒక రకంగా ఫ్యామిలీ రిలేషన్ అని నాగార్జున చెప్పారు ఆమె చాలా సెన్సిటివ్ అని అందుకే పెళ్లి చేసుకోలేదని నాగార్జున అన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

https://telugu.asianetnews.com/gallery/entertainment/nagarjuna-gave-nick-name-to-heroine-tabu-she-revealed-secret-in-front-of-all-arj-sct4cn#image5

Visitors Are Also Reading