అక్కినేని నాగార్జున, నాగచైతన్య, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, తాజాగా దూసుకెళ్లుతున్న హీరోయిన్ కృతిశెట్టి కాంబినేషన్‌లో బంగార్రాజు సినిమా తెరకెక్కుతుంది. సొగ్గాడే చిన్ని నాయన బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ సినిమాను దానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. పండుగకు పట్టుబట్టీ మరీ నాగార్జున బరిలోకి దిగాడు. అయితే ఈ చిత్రాన్ని శరవేగంగా పండుగ కోసం పూర్తి చేశారు. ప్రమోషన్స్ దాని కంటే వేగంగా చేసారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవాళ సినిమా విడుదల అయింది.
Bangarraju Twitter Review:
ఇక ట్విట్టర్‌లో అక్కినేని అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా కొందరూ యూఎస్ ప్రీమియర్స్ అంటూ కొంత మంది నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తుండడంతో మరికొంత మంది అభిమానులు రంగంలోకి దిగారు. మీ ఏడుపులు కాస్త ఆపుకోండి. ప్రీమియర్స్ రివ్యూ తొక్క, తోటకూర అన్నీ స్క్రాప్.. మాస్ యూరోపియన్ మీరు చూడబోతున్న సింగిల్ స్క్రీన్ టాక్ తీసుకోండని పేర్కొంటున్నారు. సినిమా మీద పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు వేరే లెవల్ ర్యాంపు అంటా అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.
Advertisement
Advertisement
మరికొందరూ ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీకి, సెకండాఫ్ మాత్రం అదిరిపోయింది. పండుగ సినిమా అంటూ మరికొందరూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చైతూ రఫ్పాడించాడు. నాగార్జున మాస్ అవతారంలో అదరగొట్టాడు అని పేర్కొంటున్నారు. చాలా వరకు ఫస్ట్ హాప్ బాగుంది అని, సెకండాఫ్ దాని కంటే ఇంకా బాగుందని టాక్ వినిపిస్తోంది. అక్కినేని అభిమానులకు కన్నుల పండువగా ఉందని ఇంకొక నెటిజన్ ట్వీట్ చేశాడు. కింగ్ మాస్ అవతరాన్ని మరొకసారి చూడబోతున్నామని మరికొందరూ ట్విట్‌లో పేర్కొన్నారు.
యూఏఈలో షో స్టార్ట్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిత్రం గురించి బ్లాక్ బస్టర్ అని చెప్పేస్తున్నారు. ఇక సినిమా ఏమి బాగాలేదని, రాడ్ సినిమా, అట్టర్ ప్లాప్, డిజాస్టర్ అని మరికొందరూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇది కావాలని చేస్తున్న నెగిటివిటీనా..? లేక నిజంగానే సినిమా బాగాలేదా అనే విషయం తెలియాలంటే కొద్ది గంటలు వేచి చూడాలి మరి.
Also Read: Bangarraju Movie Dialogues Telugu