Home » విడాకుల త‌ర‌వాత ప‌క్క‌ప‌క్క‌నే ఉన్నా ప‌ల‌క‌రించుకోని చైసామ్…!

విడాకుల త‌ర‌వాత ప‌క్క‌ప‌క్క‌నే ఉన్నా ప‌ల‌క‌రించుకోని చైసామ్…!

by AJAY
Ad

టాలీవుడ్ ల‌వ్లీ పెయిర్ నాగ‌చైత‌న్య స‌మంత ఇటీవ‌ల విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. గతంలో చైతూ స‌మంత ఇద్ద‌రూ క‌లిసి సినిమాలు చేశారు. వైవాహిక జీవితంగా హ్యాపీగా ఉన్నారు. కానీ స‌డ‌న్ గా విడాకులు తీసుకుంటుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌ర్నీ షాక్ అయ్యేలా చేశారు. వీరి విడాకుల‌కు సంబంధించి ఇద్ద‌రూ అస‌లు విష‌యం చెప్ప‌లేదు కానీ నెట్టింట ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వినిపించాయి. స‌మంత కుటుంబ జీవితానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని..పిల్ల‌ల‌ను క‌నేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని..ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో న‌టించ‌డం విడాకుల‌కు దారితీసింద‌ని ఇలా ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వినిపించాయి.

Advertisement

samantha-akkineni

samantha-akkineni

ఇక సెల‌బ్రెటీలు వివాహాలు చేసుకోవ‌డం ఆ త‌ర‌వాత మన్ప‌ర్ద‌లు వ‌చ్చి విడిపోవ‌డం చాలాకాలంగానే చూస్తున్నాం. కానీ ఎంతో కాలంగా అన్యోన్యంగా క‌లిసి ఉన్న స‌మంత చైత‌న్య‌లు విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు. ఇక ఇద్ద‌రూ సినిమా ప‌రిశ్ర‌మ‌లోనే ఉన్నారు. అంతే కాకుండా ఇద్ద‌రూ ప్ర‌స్తుతం ఫామ్ లో ఉన్నారు. ఒక‌రోజు కాకుండా మ‌రొక‌రోజు ఇద్ద‌రూ ఎదురుపడాల్సిందే. అలాంట‌ప్పుడు ఒక‌రికొక‌రు ఎదురుప‌డితే మాట్లాడుకుంటారా…లేదా అన్న అనుమానం కూడా చాలా మందిలో క‌లిగింది.

Advertisement

అయితే అనుక్క‌న్న‌ట్టుగానే తాజాగా వీరిద్ద‌రికీ రామానాయుడు స్టూడియోలో ఒకేసారి షూటింగ్ కు వెళ్లాల్సి వ‌చ్చింది. చైతూకు బంగార్రాజు సినిమా కోసం రామానాయుడు స్టూడియోకు వెళ్ల‌గా స‌మంత య‌శోద సినిమా చివ‌రి షెడ్యూల్ కూడా రామానాయుడు స్టూడియోలోనే జ‌రుగుతోంది. అయితే ముందుగానే ఇద్ద‌రూ ఒక‌రికి ఒక‌రు ఎదురుప‌డ‌కుండా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని స్టూడియో సిబ్బందికి కూడా ఆర్డ‌ర్ వేశార‌ట‌. కానీ వీరిద్ద‌రి అభిమానులు మాత్రం ఇద్ద‌రూ క‌లిసి మ‌ళ్లీ స్క్రీన్ పై మెర‌వాల‌న కోరుకుంటున్నారు. ఇక తాజాగా ఇద్ద‌రి తీరు చూస్తుంటే అభిమానుల ఆశ‌లు తీర‌నివేన‌ని అర్థం అవుతోంది.

Visitors Are Also Reading