Home » నాగ‌చైత‌న్య ఓకే అంటే నీతో పెళ్లికి రెడీ.. స‌మంత ట్వీట్‌..!

నాగ‌చైత‌న్య ఓకే అంటే నీతో పెళ్లికి రెడీ.. స‌మంత ట్వీట్‌..!

by Anji

తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలోకి ఏం మాయ చేశావే అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ స‌మంత‌. త‌క్కువ స‌మ‌యంలోనే మంచి పాత్ర‌ల్లో న‌టించి ఇండ‌స్ట్రీలో త‌న‌కు అంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అదేవిధంగా ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌లో అద్భుత న‌ట‌న‌ను క‌న‌బరిచి దేశ‌వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ‌చైత‌న్య స‌మంత‌లు ఇటీవ‌లే కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల త‌మ వివాహిత జీవితానికి స్వ‌స్తీ ప‌లికిన సంగ‌తి తెలిసిన‌దే.

Also Read :  అత‌నికి 14 మంది భార్య‌లు.. ఏడు రాష్ట్రాల‌కు అల్లుడు

అయితే చైత‌న్య‌ తో విడాకులు తీసుకున్న తర్వాత సామ్ సినిమాలపైనే దృష్టి పెట్టింది. ఇటీవలే విడుద‌ల అయిన సుకుమార్‌-అల్లుఅర్జున్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పలో స‌మంత ఓ ఐట‌మ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా అంటూ ఎద అందాల‌తో రెచ్చిపోయి కుర్ర‌కారుల‌ల‌కు సెగ‌లు పుట్టించింది.

ఇదిలా ఉండ‌గా.. గ‌తంలో స‌మంత‌ను ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న తాజాగా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చెయ్‌. న‌న్ను పెళ్లి చేసుకో.. అని అడిగిన నెటిజ‌న్‌కు స‌మంత క‌ష్టం.. ఒక్క ప‌ని చేయ్‌, చైత‌న్య‌నే ఆ విష‌యం అడుగు. ఆయ‌న ఓకే అంటే నాకు ఒకే అని స‌మంత రిప్లై ఇచ్చింది. ప్ర‌స్తుతం స‌మంత చేసిన ఈ ట్వీట్ నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

Also Read :  మోడ‌ల్‌గా మారిన 60 ఏళ్ల కార్మికుడు

Visitors Are Also Reading