మెగాస్టార్ చిరంజీవి సోదరునిగా కాకుండా నటుడు, నిర్మాతగా టాలీవుడ్లో తనకు అంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగేంద్రబాబు. ప్రస్తుతం సినిమాల్లో తక్కవుగానే నటిస్తోన్న ఆయన ఎక్కువగా బుల్లితెరపైనే సందడి చేస్తున్నారు. ఇక టీవీ షోలకు న్యాయ నిర్ణుతగా వ్యవహరిస్తున్నాడు. మరొక వైపు రాజకీయాల్లో కూడా బిజీగానే ఉంటూ జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యునిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎప్పుడూ నెట్టింట్లో యాక్టివ్ గా ఉండే నాగబాబు తాజాగా పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
ముఖ్యంగా ఈ పోస్ట్‌లో ఇన్నాళ్ల నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసాను. ఎన్నో విపత్తులను ఈ పోస్ట్‌లో ‘ఇన్నాళ్ల నా జీవితంలో.. ఎన్నో ఒడిదుడుకులను చూశాను. ఎన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒక రకంగా చూస్తే ఈ కష్టాలు, కన్నీళ్లే నన్ను పూర్తి మనిషిగా మలచడానికి ఎంతగానో సహాయపడ్డాయి. నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. అదే గమ్యంగా నా లక్ష్యం వైపునకు ప్రయాణం సాగించాను. ఈ ప్రయాణంలో నాకు ఎన్ని ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైనా కానీ నన్ను ప్రతిసారి వెన్నంటి నడిపించి నాకు మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలు, కన్నీళ్లే.
Advertisement
అందుకే అప్పటి నుంచి నా పూర్తి సమయాన్ని నా గమ్యం చేరుకోవడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకు వస్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుందని నాగబాబు రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో నాగబాబు ఇంత పెద్ద పోస్ట్ చేయడం వెనుక ఆంతర్యమేమిటన్నది మాత్రం తెలియరావడం లేదు. మరల చిత్ర నిర్మాణం వైపు దృష్టి మరల్చబోతున్నారా..? అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో నాగబాబు ఈ విషయంలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. రేపు మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతున్న విషయం తెలిసినదే. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా సభ ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు.
Also Read : రాధేశ్యామ్‌లో ప్రభాస్ పోషించిన పాత్ర రియల్ లైఫ్‌లో ఎవరిదో తెలుసా..?
ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది… pic.twitter.com/OcuygCcMHv
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 12, 2022