Telugu News » Blog » VIDEO : నిహారిక ప‌బ్ ఇష్యూపై నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

VIDEO : నిహారిక ప‌బ్ ఇష్యూపై నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by AJAY
Ads

రాడిస‌న్ బ్లూ ప‌బ్ లో గ‌త రాత్రి పోలీసులు దాడులు నిర్వ‌హించిన సంగతి తెలిసిందే. అర్ద‌రాత్రి త‌ర‌వాత కూడా ప‌బ్ ను నిర్వ‌హిస్తూ రేవ్ పార్టీ నిర్వ‌హించిన నేప‌థ్యంలో పోలీసులు దాడులు చేశారు. పోలీసుల సోదాల్లో డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ‌టంతో మొత్తం 150మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న‌వారిలో సినీరాజ‌కీయ‌ప్ర‌ముఖులు ఉన్నారు. ఎంపీలు, మాజీ ఎంపీల‌తో పాటూ సినీతార‌లు రాహుల్ సిప్లింగ‌జ్, మెగా డాట‌ర్ నిహారిక ను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు.

అయితే మీఈ వార్త ఉద‌యం నుండి అటు సోష‌ల్ మీడియాలో ఇటు మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా తాజాగా నాగ‌బాబు స్పందించారు. నాగబాబు మీడియాలో మాట్లాడుతూ……ప‌బ్ లో నిహారిక ఉండ‌టం వ‌ల్ల తాను స్పందిస్తున్న‌ట్టు తెలిపారు. ప‌బ్ టైమింగ్ ల‌ను ప‌రిమితికి మించి న‌డ‌ప‌డం వ‌ల్ల పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నార‌ని అన్నారు. పోలీసులు నిహారిక త‌ప్పు లేద‌ని చెప్పార‌ని అన్నారు. అంతే కాకుండా నిహారిక కూడా త‌న విష‌యంలో క్లియ‌ర్ గా ఉంద‌ని అన్నారు.

niharika konidela

niharika konidela

సోష‌ల్…మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి తప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేయ‌కూడ‌ద‌నే తాను స్పందించాన‌ని చెప్పారు. మేము చాలా క్లియ‌ర్ గా ఉన్నాము…ద‌య‌చేసి అవ‌స‌రం లేని విష‌యాల‌ను ప్ర‌సారం చేయ‌వద్దు…అంటూ నాగ‌బాబు త‌న వీడియోలో వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే నిహారిక ప‌బ్ లో ప‌ట్టుబ‌డిన త‌ర‌వాత నాగ‌బాబు మ‌రియు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీలో డ్ర‌గ్స్ పై పోరాటం చేశార‌ని కానీ ఆయ‌న అన్న కూతురు నిహారిక ఇప్పుడు ప‌బ్ లోనే ప‌ట్టుబ‌డ్డారని అన్నారు. నాగబాబు కూడా ఏపీలో డ్ర‌గ్స్ అంశం పై వీడియోలు చేశార‌ని ఇప్పుడు ఏం వీడియో చేశార‌ని ట్రోల్స్ వ‌స్తున్నాయి.

 


You may also like