అక్కినేని నాగచైతన్య జోష్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై.. ఇండస్ట్రీలో మెల్ల మెల్లగా పాపులారీటిని సంపాదించుకుంటున్నాడు. ముఖ్యంగా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. యూత్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ ని ఏర్పరుచుకున్నాడు. నాగచైతన్యకి కార్లు, స్పోర్ట్స్ బైకులు అంటే చాలా ఇష్టం. ఫెరారీ నుంచి మెర్సిడెస్ వరకు ఈ అక్కినేని ఇంటి గ్యారెజీలో భారీ కలెక్షన్లు దాగుంది. మార్కెట్ లోకి కొత్తగా ఏ స్పోర్ట్స్ బైకు వచ్చినా అతని మనసు చెప్పిందంటే చాలు.. వెంటనే దానిని తన గెరేజ్ లో ప్రత్యక్ష్యమవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే చైతూ దగ్గర లగ్జరీ బైకులు, కార్ల కలెక్షన్ భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. నాగచైతన్య దగ్గర ఉన్న ఖరీదైన వాహనాలు ఏంటి ? వాటి ధర ఎంతో తెలుసుకుందాం.
Advertisement
BMWR9T :
నాగచైతన్య దగ్గర ఉన్నటువంటి బైకుల్లో అత్యంత ఖరీదైన బైకు BMWR9T ఒకటి. 2014లో లాంచ్ అయిన ఈ బైకు కోసం చైతూ సుమారు రూ.19లక్షలు వెచ్చించి మరీ సొంతం చేసుకున్నాడు. ఈ బైకుతో విడాకుల కంటే ముందు సమంతతో చక్కర్లు కొట్టాడు.
Triumph Thruxton R :
నాగచైతన్య సాధారణ బైకులతో పాటు రేసు బైకులను కూడా చాలా ఇష్టపడుతాడు. అతను ఏ బైకును అయినా సరే కొనాలనుకుంటే చాలు.. దాని ఖరీదు ఎంత..? ఏంది ? అని కూడా ఆలోచించడు. సుమారు రూ.13లక్షలు విలువైన ఈ రేసర్ బైకు Triumph Thruxton R ని సొంతం చేసుకున్నాడు.
Advertisement
Ferrari F 430 :
మార్కెట్ లో ఈ కారుకు క్రేజ్ మామూలుగా ఉండదు. జాన్సేనా నుంచి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరకు ఫెరారీ ఎఫ్ 430 రెడ్ బ్యూటీ కారుకు భారీ ఫాలోయింగే ఉంది. ఈ కారు ధర సుమారు రూ.1.75 కోట్లకు పైగా ఉంటుంది. అయితే నాగచైతన్య తన కార్ల కలెక్షన్లలో ఇది కూడా ఒకటి ఉండటం విశేషం.
Mercede Benz G-Class G 63 :
నాగచైతన్య వద్ద ఉన్న ఈ మెర్సిడిస్ బెంజ్ కారు ఖరీదు దాదాపు కోటి రూపాయలకి పైగానే ఉంటుందట. చైతన్యతో పాటు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్, టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వద్ద కూడా ఈ కారు ఉండటం విశేషం.
MV Agusta F4 :
నాగచైతన్య వద్ద ఉన్న లగ్జరీ బైకుల్లో ఆయన ఫేవరేట్ MV Agusta F4. ఈ బైకు ధర దాదాపు రూ.26 నుంచి రూ.35లక్షలకు పైగా ఉంటుందట. ఈ బైకుపై చైతన్య షికార్లు చేస్తూ పలు సందర్భాల్లో మీడియా కంట కూడా కనిపించారట. వీటితో పాటు యమహా YZFR1 స్పోర్ట్స్ బైకు, హోండా స్పోర్ట్స్ బైకుతో సహా మరికొన్ని బైకులు గ్యారేజీలో దర్శనమిస్తున్నాయి.
మరికొన్నిముఖ్యమైన వార్తలు :