సమంత, నాగచైతన్య ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వారిద్దరి వచ్చిన మనస్పార్థాల కారణంగా గత ఏడాది అక్టోబర్ నెలలో విడిపోతున్నట్టు ఇరువురు ప్రకటించారు. వీరి విడాకులకు సంబంధించి ఇప్పటికీ కూడా ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా అకస్మాత్తుగా తాము విడిపోతున్నామని ప్రకటించడంతో నాగచైతన్య, సమంత అభిమానులు అప్పట్లో ఒక్కసారికి షాక్ కి గురయ్యారు.
Advertisement
ఇదిలా ఉంటే.. సమంత ప్రస్తుతం మయోసిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే తన వ్యాధి గురించి చెప్పింది సమంత. తనకు ఉన్న వ్యాధి గురించి తెలుసుకుని చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు సమంతను ఓదార్చారు. తన పరిస్థితిని తెలుసుకొని నాగచైతన్య కూడా చాలా టెన్షన్ పడ్డాడట. అందుకే వెంటనే ఆసుపత్రికి వెళ్లాడట. తనకు అసలు ఏమైందో అని ఆరా తీసి తెలుసుకున్నాడట. ముఖ్యంగా సమంతను ఆసుపత్రిలో బెడ్ మీద చూసి నాగచైతన్య చాలా డిస్టర్బ్ అయినట్టు సమాచారం.
Advertisement
Also Read : సావిత్రి అలాంటి స్థితిలో ఉన్నా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎందుకు సాయం చేయలేదు..? ఆ ఒక్క తప్పే వారిని ఆపిందా..?
సమంతను ఓదార్చడంతో పాటు మనోధైర్యం చెప్పి తన తల్లిదండ్రులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడాడంట నాగచైతన్య. మరోవైపు సమంతకు ఇచ్చిన విడాకులను వెనక్కీ తీసుకోవాలని నాగచైతన్యకి నాగార్జున చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో సమంతకు తోడుగా ఉండాలని, తనను ప్రేమించిన వాడివి కాబట్టి ఆమెకు తోడుగా ఉండమని చెప్పాడట. అవసరమైతే విడాకులను రద్దు చేసుకో.. వాళ్ల ఫ్యామిలీతో మాట్లాడుతానని చైతుకి నాగార్జున చెప్పాడట. అందుకు నాగచైతన్య కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. నాగచైతన్య కోరితే సమంత ఒప్పుకుంటుందా ? ఇద్దరు తిరిగి భార్య భర్తలు అవుతారా ? సమంత కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకుటారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.