Home » నాద‌ల్ అద‌ర‌హో..! అత్య‌ధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆట‌గాడిగా రికార్డు

నాద‌ల్ అద‌ర‌హో..! అత్య‌ధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆట‌గాడిగా రికార్డు

by Anji
Ad

ప‌ద‌మూడు సార్లు విజేత‌గా నిలిచిన ఫ్రెంచ్ ఓపెన్‌లో గ‌త ఏడాది సెమీస్‌లో అనూహ్యంగా ఓట‌మి పాల‌య్యాడు. ఇక ఎర్ర‌మ‌ట్టి సూర్యునికి ప‌డ‌మ‌ర దిక్కే దారని అంద‌రూ అనుకున్నారు. గాయాల కార‌ణంగా ఏడాదిలో దాదాపు స‌గం రోజులు కోర్టు బ‌య‌టే గ‌డిపాడు. తిరిగి అత‌ను ఫిట్‌నెస్ సాధించి బ‌రిలోకి దిగ‌డం టైటిల్ నెగ్గ‌డం క‌ష్ట‌మే అనుకున్నారంద‌రూ. కానీ అత‌ని ఆట‌.. త‌గ్గేదేలే అన్న విధంగా కొన‌సాగింది. వ‌య‌స్సు మీద ప‌డుతుంది అత‌ని ప‌ని అయిపోయింద‌ని ఇకేమి ఆడుతాడు. టోర్నీలో ఆడినా.. ఫైన‌ల్ చేర‌గ‌ల‌డా..? చేరినా టైటిల్ కొట్ట‌గ‌ల‌డా..? ఇలా ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఫైన‌ల్‌లో తొలి రెండు సెట్లు ఓడిపోయాడు. ఇక ఓడిపోతాడునుకున్న త‌రుణంలో పుంజుకుని అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసి త‌గ్గేదేలే అని త‌న జోరును చూపించాడు.

Rafael Nadal can't hide now: can glory come?

Advertisement

ముఖ్యంగా నాద‌ల్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో అంత‌గా అదృష్టం క‌లిసి రాద‌నే చెప్పాలి. 2009లో తొలిసారి అక్క‌డ టైటిల్ గెలిచిన త‌రువాత మ‌రొక నాలుగు సార్లు ఫైన‌ల్‌కు చేరుకున్నా.. నిరాశ మాత్రం త‌ప్ప‌లేదు. పోరాటాన్ని న‌మ్ముకుని అదృష్టాన్ని వెన‌క్కి నెట్టి రికార్డు గ్రాండ్ స్లామ్ విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ముందు వ‌ర‌కు నాద‌ల్‌, ఫెద‌ర‌ర్‌, జ‌కోవిచ్‌లు ముగ్గురు త‌లో 20 టైటిళ్ల‌తో అత్య‌ధిక గ్రాండ్ స్లామ్ విజ‌యాల్లో స‌మానంగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం నాద‌ల్ వారిరువురినీ వెన‌క్కి నెట్టి 21వ టైటిల్ తో ద‌ర్జాగా సింహ‌స‌నంపై కూర్చున్నారు. 2020 ఫ్రెంచ్ ఓపెన్‌లో గెలిచి 20వ టైటిల్ ఖాతాలో వేసుకున్న అత‌న్ని గాయాలు వెన‌క్కి నెట్టాయి.

Advertisement

For Nadal and His Contemporaries, It Is About Winning, and Quickly - The  New York Times

ఆస్ట్రేలియా ఓపెన్‌లో హోరా హోరీ జ‌రిగిన ఫైన‌ల్ ఆరో ఆరో సీడ్ నాద‌ల్ 2-6, 6-7, (5-7), 6-4, 6-4, 7-5 తో రెండ‌వ సీడ్ మెద్వేదేవ్ ర‌ష్యాపై విజ‌యం సాధించాడు. తొలి రెండు సెట్లు కోల్పోయినా.. నాద‌ల్ పోరాడిన తీరు అద్భుత‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన మెద్వెదేవ్ నెమ్మ‌దించాడు. నాద‌ల్ చివ‌రి 7నెల‌ల్లో ఒకే ఒక్క టోర్న‌మెంట్ ఆడాడు. మెద్వెదెవ్ మంచి ఫామ్‌లో కొన‌సాగుతున్నాడు. తొలి రెండు సెట్ల‌ను మెద్వెదెవ్ పై చేయి సాధించాడు. నాలుగో గేమ్‌లో బ్రేక్ సాధించి. ఆ త‌రువాత స‌ర్వీస్‌ను నిల‌బెట్టుకున్న నాద‌ల్ 4-1 ఆధిక్యం సంపాదించారు. మెద్వెదెవ్ ఏడో గేమ్‌లో బ్రేక్ సాధించ‌గా.. వెంట‌నే నాద‌ల్ కూడా ప్ర‌త్య‌ర్థి స‌ర్వీస్‌ను బ్రేక్ చేశాడు. చివ‌రిలో నాద‌ల్‌, మెద్వెదెల్ ఇద్ద‌రూ స‌ర్వీసులు నిల‌బెట్టుకోవ‌డంతో అయిదో సెట్‌లో 2-2. కానీ త‌న అత్యుత్త‌మ స్థాయి పిట్‌నెస్ ప్ర‌ద‌ర్శిస్తూ.. క్ర‌మంగా ప‌ట్టు బిగించాడు నాద‌ల్‌. ఓ దిశ‌లో నాద‌ల్‌కు షాక్ ఇస్తూ బ్రేక్ సాధించిన మెద్వెదెవ్ 5-5తో ఓ అద్భుత అవ‌కాశాన్ని సృష్టించుకున‌నాడు. ఉత్కంఠ‌తో అవ‌కాశాన్ని వినియోగించుకోలేక‌పోయాడు. బ‌లంగా పుంజుకుని వెంట‌నే బ్రేక్ సాధించిన నాద‌ల్ అల‌వోక‌గా స‌ర్వీస్ నిల‌బెట్టుకుని విజేత‌గా నిలిచాడు. ఓపెన్‌ల‌లో జ‌కోవిచ్ త‌రువాత ప్ర‌తి గ్రాండ్ స్లామ్‌ను క‌నీసం రెండు సార్లు గెలిచిన పురుష ఆట‌గాడిగా నాద‌ల్ నిలిచాడు.

Visitors Are Also Reading