Home » నా సామి రంగ.. నాగార్జున ఇరగదీసాడుగా.. అదిరిపోయిన ట్రైలర్!

నా సామి రంగ.. నాగార్జున ఇరగదీసాడుగా.. అదిరిపోయిన ట్రైలర్!

by Srilakshmi Bharathi
Ad

కింగ్ నాగార్జున అక్కినేని ‘నా సామి రంగ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి పండుగ సందర్భంగా రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 14 న థియేటర్లలో సందడి చేయనుంది. నాగార్జున నటించిన ఈ సంక్రాంతి సందర్భంగా అభిమానులకు ట్రీట్‌గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. 2 నిమిషాల 30 సెకన్ల నిడివి గల ట్రైలర్ సినిమా కథపై ఒక అవుట్ లైన్ ను ఇచ్చేసింది. కింగ్ నాగార్జున కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకమైన యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది.

Advertisement

విజయ్ బిన్ని నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా కోసం నాగార్జున పూర్తి డ్రామా లుక్ లో కనిపించనున్నారు. అలాగే.. పూర్తిగా ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్న నాగార్జునను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ కనిపిస్తున్నారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి ఈ ట్రయో వస్తున్నా “నా సామి రంగ” సినిమా ప్రేక్షకులని నిజంగానే నా సామి రంగ అనిపించేలా ఉంది.

Advertisement

ట్రైలర్ లో ఆషిక రంగనాధ్ అందంగా ముస్తాబై రావడం.. ఆమెకి, నాగార్జున కి మధ్య జరిగిన సంభాషణలు కూడా బాగున్నాయి. అలాగే.. రాజ్ తరుణ్ సెటైర్ కూడా బాగానే పేలింది. ఇక ఈ ముగ్గురి కాంబో కూడా తెరపై చూడ ముచ్చటగా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది. ఇంకా ఈ ట్రైలర్ లో అందరు కలిసి తాగుతూ డాన్స్ చేయడం కూడా ఊర మాస్ గా ఉంది. ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం అదిరిందనే చెప్పాలి. ట్రైలర్‌కి అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. విజయ్ బిన్ని ‘నా సామి రంగ’ ట్రైలర్ ద్వారా అభిమానుల కోసం యాక్షన్-లోడెడ్ పీరియాడిక్ ఎంటర్‌టైనర్‌ను అందిస్తానని చెప్పకనే చెప్పినట్లయింది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading