ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల భూమిలోంచి వింత శబ్దాలు రావడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని ఐరాల మండలం ఎర్రపల్లి పంచాయతీ, అబ్బగుండు గ్రామంలో భూమి లోపలి నుంచి వింతైన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఉన్నట్టుండి భూమి కంపించినది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఐరాల తహసీల్దార్ బెన్‌రాజ్, ఎంపీడీఓ నిర్మలదేవీ హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామ ప్రజలను విచారించగా దాదాపు 10 రోజుల నుంచి రాత్రి సమయంలో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల నుంచి పగటిపూట కూడ వింతశబ్దాలు వినిపించాయని, దీంతో భూమి కంపించిందని అధికారులకు వెల్లడించారు ప్రజలు.
Advertisement
Advertisement
అబ్బగుండు గ్రామంలో ఉన్న ఇండ్లలోని గోడలు బీటలు పారిందని వివరించారు. భూమి కంపించడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని భయంతో బిక్కు బిక్కుమంటు బ్రతుకుతున్నాం అని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మైనింగ్ కార్యకలాపాలే కారణమని కూడ గ్రామస్తులు పలువురు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు మైనింగ్ ఏడి ప్రకాష్ కుమార్, ఎస్ఐ హరిప్రసాద్ కూడ సిబ్బందితో కలిసి సందర్శించారు. వింత శబ్దాలకు కారణం తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటాం అని, గ్రామస్తులు ధైర్యంగా ఉండాలని సూచించారు అధికారులు.
ఇవి కూడా చదవండి: చిత్తూరు జిల్లాలో భూమిలోంచి వింతశబ్దం..భయాందోళనలో ప్రజలు