పెళ్లి అంటే ఎవరికైనా సంబరమే…పెళ్లికి ముందు ఎంతో ప్రేమతో ఉంటారు. ఒకరినొకరు విడిచిపెట్టలేమని అనుకుంటారు. అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎన్నో ప్రామిస్ లు చేసుకుంటారు. అంతే కాకుండా ఒకరు లేకుండా మరొకరు బ్రతకలేమని అనుకుంటారు. కానీ పెళ్లి తరవాత మాత్రం చాలా జంటల జీవితాల్లో సీన్ మరో రకంగా ఉంటుంది. గొడవలు…అలకలు…అనుమానాలు ఇలా చాలా జరుగుతాయి. దాంతో పెళ్లిచేసుకున్నవారితో పాటూ ఇరు కుటుంబాల్లో సంతోషం లేకుండా పోతుంది. అంతే కాకుండా గొడవలు పెరిగితే విడాకులు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లికి ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెళ్లి తరవాత జీవితం కూడా సుఖసంతోషాలతో నిండిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
పెళ్లికి ముందు కొంతమందికి లవ్ స్టోరీలు ఉంటాయి. అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా ఇద్దరిలో ఎవరికైనా గత ప్రేమకథలు ఉంటాయి. అయితే తాము గతంలో ప్రేమించినవారితో ఎలాంటి సమస్య లేకుండా విడిపోయి…వాళ్లతో ఎలాంటి సమస్యలు రావనుకుంటే షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ వారు మళ్లీ మీ జీవితంలోకి వచ్చి ఇబ్బంది పెట్టేవారైతే ముందే మీరు పెళ్లిచేసుకునే వారికి మీ ప్రేమ బ్రేకప్ గురించి చెప్పాలి.
Advertisement
పెళ్లికి ముందు పెళ్లి తరవాత మీరు వారికి ఇచ్చే జీవితం గురించి మాత్రమే చెప్పాలి. గొప్పలకు పోయి ఉన్నవి లేనివి చెప్పకూడదు. అలా గొప్పలు చెప్పడం వల్ల పెళ్లి తరవాత వాళ్లుఉ ఊహించుకున్నట్టుగా జీవితం లేకుంటే సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
మీ కుటుంబంలో ఉండే సమస్యల గురించి మీ ఆస్తిపాస్తులు… అప్పుల గురించి కూడా ముందే చర్చించుకుంటే మంచిది. దాంతో ఎలాంటి మనస్పర్దలు రాకుండా ఉంటాయి.
పెళ్లికి ముందే మీరు పెళ్లి చేసుకునేవారి గురించి ఇతరుల ద్వారా తెలుసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. జీవితాంతం కలిసి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా తెలుసుకున్నాకే పెళ్లికి రెడీ అవ్వాలి.
అందం విషయంలో అయినా ఆస్తుల విషయంలో అయినా నచ్చకపోయినా కుటుంబ సభ్యుల బలవంతంతో పెళ్లిల్లు చేసుకోవద్దు. అలా చేసుకున్న పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలబడటం కష్టం. కాబట్టి ముందే నచ్చకపోతే నచ్చలేదని కుటుంబ సభ్యులకు అర్థం అయ్యేలా చెప్పండి.
ALSO READ :
మీ జీవిత భాగస్వామికి 5 ఈ ప్రామిస్ లు చేయండి….మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టరు..!
పెళ్లిళ్లు, శుభకార్యాల్లో చదివింపులు 100, 500 కాకుండా రూ.101, రూ.501 కానుక ఇస్తారు ఎందుకో తెలుసా..?