Home » మీ జీవిత భాగ‌స్వామికి 5 ఈ ప్రామిస్ లు చేయండి….మిమ్మల్ని అస్సలు విడిచిపెట్ట‌రు..!

మీ జీవిత భాగ‌స్వామికి 5 ఈ ప్రామిస్ లు చేయండి….మిమ్మల్ని అస్సలు విడిచిపెట్ట‌రు..!

by AJAY
Ad

జీవితంలోకి ఎంతో మంది వ‌స్తుంటారు పోతుంటారు. కానీ చివ‌ర‌వ‌ర‌కూ క‌లిసి ఉండేది లైఫ్ పార్ట్న‌ర్ మాత్రమే. అయితే ఎవ‌రిని బాధ‌పెట్టినా….వ‌దిలేసుకున్నా జీవితంలో లైఫ్ పార్ట్న‌ర్ ను మాత్రం విడిచిపెట్ట‌కూడ‌దు. ఎందుకంటే వారే మీ జీవితాంతం తోడుంటారు. మీకోసమే త‌మ జీవితాన్ని త్యాగం చేస్తారు. అలాంటి వారిని మిస్ చేసుకుంటే మీ జీవితం నాశ‌నం అయిపోయిన‌ట్టే.

Advertisement

మీరంటే ఎంతో ఇష్టంతో మీ జీవిత భాగ‌స్వామి మీ జీవితంలోకి అడుగు పెడ‌తారు. ఇక ప్ర‌స్తుత స‌మాజంలో చాలా మంది చిన్న చిన్న గొడ‌వ‌ల‌కే విడిపోతున్నారు. కానీ అలా చేయ‌డం వ‌ల్ల జీవితంలో ఇబ్బందులు త‌ప్ప‌వు. కాబ‌ట్టి మీ లైఫ్ పార్ట్న‌ర్ కు మీరు కొన్ని ప్రామిస్ లు చేస్తే వాళ్లు మీతో ఎప్పుడూ విడిపోర‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రామిస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం…మీకు అప్ప‌టికే ఏమైనా చెడు అల‌వాట్లు ఉన్న‌ట్ట‌యితే మీ లైఫ్ పార్ట్న‌ర్ కోసం వాటిని శాశ్వ‌తంగా విడిచిపెట్టాలి.

Advertisement

అలా చేయ‌డం వ‌ల్ల మీపై వారికి మ‌రింత ప్రేమ పెరుగుతుంది. ఆనంద‌మైనా దుఃఖ‌మైనా ముందుగా జీవిత భాగ‌స్వామితోనే పంచుకోవాలి. దాంతో వారికి మీరు వారికి ఎంత ప్రాధాన్య‌త ఇస్తున్నారో అర్థం అవుతుంది. వాళ్లు జీవితంలో మిమ్మల్ని విడిచిపెట్టే ఛాన్స్ ఉండ‌దు. మీ భావోద్వేగాల‌ను పంచుకున్న‌ప్పుడే మీ బంధం బ‌ల‌ప‌డుతుంద‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు.

క‌ష్ట స‌మ‌యాల‌లో మీ జీవిత భాగ‌స్వామిని అస్స‌లు ఒంటరిగా వ‌దిలేయ‌కూడ‌దు….మీరే వారికి ధైర్యం కాబ‌ట్టి వెన్నంటే ఉంటూ వాళ్ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంలో తోడుగా ఉండాలి. మీ త‌ల్లి తండ్రులు, తోబుట్టువులు, స్నేహితుల‌తో ఎంత నిజాయితీగా ఉంటారో జీవిత‌భాగ‌స్వామితో కూడా అంతే నిజాయితీగా ఉండాలి. నిజాయితీ ఉన్న బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంది.

also read :

మంత్రి రోజాకు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స‌న్మానం చేయాలంటున్న బండ్ల గ‌ణేష్

అర‌టిపండు తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటో మీకు తెలుసా..?

Visitors Are Also Reading