తెలుగు సినీ ఇండస్ట్రీలో మురళీమోహన్ అంటే తెలియనివారుండరు. ఆయన తన నటనతో చాలా మంది అభిమానులను సంపాదించుకోవడమే కాక రాజకీయంలో కూడా ఎన్నో పదవులు అలంకరించారు. ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో కొన్ని సహాయ పాత్రల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు. మురళీమోహన్ దాదాపుగా 350 సినిమాల్లో నటించారు. ఆయన 2015 వరకు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాధ్యతలు స్వీకరించారు.
Advertisement
Advertisement
అయితే మురళీమోహన్ టిడిపి తరఫున రాజమండ్రి కాన్స్టెన్సీ నుంచి 2014 లోక్ సభకు ఎన్నికయ్యారు. తానే సొంతంగా జయభేరి అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో సినిమాలను నిర్మించారు..తాజాగా ఆయన యూట్యూబ్ ఇంటర్వ్యూలో నందమూరి తారక రామారావు గురించి పలు కీలక విషయాలను బయటపెట్టారు. మా కుటుంబం మొత్తం కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుంది, కానీ నేను ఎన్టీఆర్ కి అభిమాన నాయకుడిని అందుకే టీడీపీలో చేరానని అన్నారు. మహోన్నత శక్తి ఉన్నటువంటి ఇందిరాగాంధీని ఎదిరించి ఆయన గెలిచి నిలబడ్డారని తెలిపారు. ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లి చేయించుకొని తిరిగివచ్చిన రోజుల్లో దాదాపు 50 నుంచి 60 మంది సినిమా ప్రముఖులతోపాటుగా ఎంతో మంది అభిమానులు ఎయిర్పోర్టులో ఎదురు చూశామని తెలియజేశారు. ఎన్టీఆర్ అందర్నీ చూసి చాలా సంతోషించారు అని తమ దగ్గరికి వచ్చి పలకరించారు అని అన్నారు. ఆ తర్వాత రోజే ఎన్టీఆర్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలియజేశారు. అక్కడ కాసేపు సరదాగా మాట్లాడుకున్నామని, ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో హోటల్ కు వెళ్లి పడుకుంన్నామని అన్నారు. అయితే మరుసటి రోజు ఉదయం మద్రాసు చేరుకున్నాక రాత్రి జరిగినటువంటి ప్రోగ్రాం గురించి మేం మాట్లాడుకున్నామని అప్పుడు రామారావు గారు అసలు విషయాన్ని తనకు చెప్పారని అన్నారు.ఆ విషయం చెప్పడంతో నా కడుపు మండి పోయిందని, నటుల కంటే గొప్పగా రాజకీయ నాయకుల నటిస్తున్నారని, రాత్రి మీటింగులో ఏం తెలియని వారిగా అందరితో బాగా కలిసి ఉంన్నారని, తెల్లవారేసరికి ముఖ్యమంత్రిగా దించేశారని చెప్పటంతో కడుపు మండి పోయింది అని అన్నారు. దీంతో వెంటనే తెలంగాణా మరియు ఆంధ్ర, రాయలసీమ మొత్తం ప్రచారం చేశామని అన్నారు. ఆ తర్వాత నెలకే ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారని తెలిపారు మురళిమోహన్.
ALSO READ: ఒక్కో ఇంటర్వ్యూకు బిత్తిరి సత్తి ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటాడో తెలుసా..!
25 ఏళ్లుగా హీరో వెంకటేష్ రోజా మధ్య మాటలు లేకపోవడానకి కారణం అదేనా..?