Home » మురళీమోహన్, జయసుధ అంతటి స్టార్లు అయ్యారంటే కారణం ఆయనే..!!

మురళీమోహన్, జయసుధ అంతటి స్టార్లు అయ్యారంటే కారణం ఆయనే..!!

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వారి నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ 6 పదుల వయసు దాటిన నటన రంగంలో రాణిస్తూనే ఉన్నారు. ఇంతకీ వారు ఎవరయ్యా అంటే.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన జయసుధ, స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మురళీమోహన్. వీరిద్దరికి తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి గుర్తింపు ఉందో మనందరికీ తెలుసు. సినిమాలో ఎలాంటి పాత్ర అయినా సరే వీరికి అడ్డు ఎవరు ఉండరు. అలాంటి వీరిద్దరూ ఆర్థికపరంగా కూడా మంచి ఆలోచనతో ఉండటం వల్ల జీవితంలో బాగా సెట్ అయిపోయారు.

Advertisement

 

వీళ్ల తరం నటులతో పోలిస్తే వీరు మంచి స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు. వ్యాపార పరంగా కూడా వీరిద్దరూ మంచి పొజిషన్ లో ఉన్నారు. అలా వీరిద్దరూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించి స్టార్లుగా మారడానికి ప్రధాన కారణం దాసరి నారాయణరావు అంటూ ఉంటారు. ఈ ఇద్దరు కెరియర్ మొదలుపెట్టినప్పుడు వీరికి దాసరి నారాయణరావు సలహాలిస్తూ ఏ విధంగా ఉండాలని చెప్పే వారట. ముఖ్యంగా మురళీమోహన్ హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ కావడం వెనుక దాసరి ఉన్నారని అంటూ ఉంటారు. ప్రస్తుతం మురళీమోహన్ ఇండస్ట్రీలోని అత్యధిక ధనవంతుల్లో ఒకరిగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా ఆస్తులు ఉన్నాయి.

Advertisement

జయసుధ విషయానికి వస్తే ఆమె మొదట్లో బాలీవుడ్ కి వెళ్లాలని భావించిందట. జయప్రద, శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్లడంతో తాను కూడా వెళ్లాలని చూసారట. కానీ దాసరి వద్దని, నీకు కలిసి రాదు అని చెప్పారట. దీంతో ఆమె తెలుగులోనే సినిమాలు చేస్తూ బాగా సంపాదించింది. ప్రస్తుతం వివిధ పాత్రలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ విధంగా వీరు దాసరి నారాయణరావు సలహాలతో ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉన్నామని చెబుతూ ఉంటారు.

also read

Visitors Are Also Reading