ఐపీఎల్ చరిత్రలో అంత్యంత విజయవంతమైన జట్టు ఏదైనా ఉంది అంటే అది ముంబై ఇండియన్స్. రోహిత్ కెప్టెన్సీలోని ఈ జట్టు మొత్తం 5 సార్లు టైటిల్ గెలిచింది. ఇక ఈ ఏడాది కూడా టైటిల్ ఫెవరెట్ గా వచ్చిన ముంబై… ఎప్పుడు చేయనంత చెత్త ప్రదర్శన చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఏకంగా ఆరు మ్యాచ్ లు ఓడిపోయిన ముంబై జట్టు ప్లే ఆఫ్స్ నుండి బయటకు వచ్చిన మొదటి జట్టుగా నిలిచింది. గతంలో మొదటి 5 మ్యాచ్ లు ఓడి ప్లే ఆఫ్స్ కు వచ్చిన ముంబై ఇప్పుడు ఆరు ఓడిపోవడంతో.. ప్లే ఆఫ్స్ ఆశలు అయిపోయాయి.
Advertisement
అయితే గత సీజన్ వరకు 8 జట్లతో ఆడిన ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెట్టాలంటే కనీసం 8 మ్యాచ్ లు గెలవాలి. అలా అయితేనే బెర్త్ ఖాయం అవుతుంది. లేదంటే చివరి వరకు టెన్షనే. కానీ ఐపీఎల్ 2022 లో రెండు జట్లు కొత్తగా రావడంతో పోటీ పెరిగింది. అందువల్ల 8 మ్యాచ్ లు గెలిచిన ప్లే ఆఫ్స్ కు వెళ్తామో లేదో తెలియని పరిస్థితి. దానికి తోడు చెన్నై, ముంబై జట్లు మినహా మిగిలిన అన్ని జట్టు సమానమైన పాయింట్లతో ఉంది నెట్ రన్ రేట్ లో పోటీ పడుతున్నాయి.
Advertisement
ఐపీఎల్ లో ప్రతి జట్టు14 మ్యాచ్ లు ఆడుతుంది. ఇక అందులో ఆడిన 6 మ్యాచ్ లో ముంబై ఓడిపోవడంతో మిగిలిన 8 మ్యాచ్ లో వరుసగా నెగితేనే… ముంబై జట్టుకు ప్లే ఆఫ్స్ కు వెళ్లే ఆవకాశం ఎంతో కొంత ఉంటుంది. కానీ ఇప్పుడు మిగిలిన 9 జట్లతో ఉన్న పోటీలో ముంబై ఆ పని చేయడం అసాధ్యం. కాబట్టి ఐపీఎల్ 2022 లో ప్లే ఆఫ్స్ రేస్ నుండి బయటకు వచ్చిన మొదటి జట్టుగా ముంబై నిలిచింది. దాంతో ఆ జట్టుకు అభిమానులు అందరూ గుడ్ బై చేబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
ఆర్సీబీ టైటిల్ గెలిచే వరకు పెళ్లి చేసుకోను.. అయితే అంతే సంగతి..!
రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డ్..!