Home » రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డ్..!

రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డ్..!

by Azhar
Ad

ప్రస్తుతం ఐపీఎల్ 2022 లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో సతమతమవుతుంది. జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపైన కూడా విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఐపీఎల్ లో కెప్టెన్ గా రాణించడం వల్లనే.. అతనికి భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. ఇక కారణాలు ఏవైనా ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందే రోహిత్ మూడు ఫార్మాట్లలో టీంఇండియాకు కెప్టెన్ అయ్యాడు. కాకపోతే ఇప్పుడు ఐపీఎల్ లో బ్యాటింగ్ లోను కెప్టెన్సీలోను విఫలమవుతుండటంతో దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది.

Advertisement

ఇదంతా ఇలా ఉంటె… ముంబై జట్టు ఈరోజు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్ లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత బ్యాటర్ గా నిలిచాడు. రోహిత్ కంటే ముందు ఈ ఫిట్ ను భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధించాడు. ఈ మ్యాచ్ లో రబడా వేసిన నాలుగో ఓవర్లో మూడో బంతిని సిక్స్ గా మలిచిన రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు.

Advertisement

ఇక మొత్తంగా చూసుకుంటే.. ఈ ఫిట్ సాధించిన 7వ ఆటగాడు రోహిత్. ఈ జాబితాలో యూనివర్సల్ బాల్స్ క్రిస్ గేల్ 14562 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత షోయబ్ మాలిక్ 11698 పరుగులు, కీరన్ పోలార్డ్ 11474 పరుగులు, ఆరోన్ పించ్ 10499 పరుగులు, విరాట్ కోహ్లీ 10379 పరుగులు, డేవిడ్ వార్నర్ 10373 పరుగులతో వరుసగా ఆరు స్థానాల్లో ఉండగా.. ఇప్పుడు రోహిత్ 10003 పరుగులతో 7వ స్థానంలో నిలిచాడు.

ఇవి కూడా చదవండి :

పృథ్వీ షా 100 టెస్టులు ఆడుతాడు…!

సాహా చేసిన ఆరోపణలపై బీసీసీఐకి త్రిసభ్య కమిటీ నివేదిక..!

Visitors Are Also Reading